వర్షానికి కారుతున్న మెట్రో స్టేషన్‌

Rain Water Leaks In Bangalore Majistic Metro Station  - Sakshi

బెంగళూరు మెజిస్టిక్‌ స్టేషన్‌లో నాసిరకం పనుల ఫలితం  

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో అతిపెద్ద మెట్రో రైల్‌ స్టేషన్‌గా ప్రసిద్ధిగాంచిన మెజిస్టిక్‌ స్టేషన్‌లో వాననీరు కారుతుండటం కలకలం రేపుతోంది. భూగర్భంలో ఉన్న ఈ మెట్రో పనులు నాసిరకంగా చేయడమే దీనికి కారణమని ఆరోపణలు వినవస్తున్నాయి. సోమ, మంగళవారం రాత్రి సమయాల్లో బెంగళూరులో ఓ మోస్తరు వర్షం కురిసింది. టికెట్‌ కౌంటర్ల వద్ద వాన నీరు కారుతుండటం గమనించిన అధికారులు ప్లాస్టిక్‌ బకెట్లను పెట్టారు. గురువారం ఉదయం దీన్ని గమనించిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైలు ప్రయాణించే సొరంగ మార్గంలో కూడా నీరు లీకవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి ఇటీవలే నిర్మించిన మెట్రో స్టేషన్‌లో మామూలు వానలకే నీరు కారటం ఏమిటని సోషల్‌ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు. నాసిరకం పనులు చేసిన కంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top