రైల్వే ‘ఫ్లెక్సీ ఫేర్‌’లో స్వల్ప మార్పులు | Railway passenger fare hike: Public outcry against Suresh Prabhu | Sakshi
Sakshi News home page

రైల్వే ‘ఫ్లెక్సీ ఫేర్‌’లో స్వల్ప మార్పులు

Dec 13 2016 3:17 AM | Updated on Oct 2 2018 7:28 PM

డిమాండ్‌కు అనుగుణంగా ధరలను నిర్ణయించే విధానం (ఫ్లెక్సీ ఫేర్‌)లో రైల్వే స్వల్ప మార్పులు తీసుకురానుంది.

న్యూఢిల్లీ: డిమాండ్‌కు అనుగుణంగా ధరలను నిర్ణయించే విధానం (ఫ్లెక్సీ ఫేర్‌)లో రైల్వే స్వల్ప మార్పులు తీసుకురానుంది. సెప్టెంబర్‌ 9న అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్ల టిక్కెట్‌ కొంటే సాధారణ ధర కన్నా గరిష్టంగా 50 శాతం వరకు ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. త్వరలోనే దీనిని 40 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 9 నుంచి అక్టోబర్‌ 31 మధ్య ఆ రైళ్లలో 5,871 బెర్తులు ఖాళీగా మిగిలిపోవడంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఫ్లెక్సీ ఫేర్‌ ప్రకారం రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రతి 10 శాతం సీట్లు బుక్‌ అవుతున్న కొద్దీ మిగిలిన సీట్లకు చార్జీ 10 శాతం మేర పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement