‘ఓషివారా-జేవీఎల్‌ఆర్’కు మోక్షమెన్నడో.. | 'Osivara - jevielar' road when going to start | Sakshi
Sakshi News home page

‘ఓషివారా-జేవీఎల్‌ఆర్’కు మోక్షమెన్నడో..

Mar 9 2014 9:56 PM | Updated on Apr 3 2019 4:53 PM

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓషివారా- జేవీఎల్‌ఆర్ (జోగేశ్వరి-విక్రోలి లింక్ రోడ్) బ్రిడ్జి ఇప్పటివరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.

ఐదేళ్లైన ముందుకు కదలని ప్రాజెక్టు
 
 సాక్షి, ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓషివారా- జేవీఎల్‌ఆర్ (జోగేశ్వరి-విక్రోలి లింక్ రోడ్) బ్రిడ్జి ఇప్పటివరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఐదేళ్ల కిందట బీఎంసీ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి రెండు విడతల్లో పనులు పూర్తిచేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో ఓషివారా లింక్ రోడ్డును వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేకు (డబ్ల్యూఈహెచ్)కు అనుసంధానం చేయాల్సి ఉండగా, రెండవ విడతలో హైవే ను జేవీఎల్‌ఆర్‌తో అనుసంధానం చేయాల్సి ఉం టుంది. 2009లో రూ.198 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని బీఎంసీ తలచింది. అయితే మొదటి విడత పనులను తిరిగి రెండు భాగాలుగా విభజించారు. దీంతో దీని అంచనా వ్యయం మరో రూ.99.87 కోట్లు పెరిగింది.
 
  ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటివరకు 60 శాతం పను లు పూర్తయ్యాయని అధికారి ఒకరు తెలిపారు. ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించి మొదటి విడత పనులను మిలత్ హైస్కూల్ నుంచి ఎస్‌వీ రోడ్ వరకు చేపట్టగా కేవలం 10శాతం పనులే పూర్తయ్యాయి. కాగా, రెండో విడత పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా బ్రిడ్జిపై కేబుల్ వైర్లు అడ్డురావడంతో మిగతా పనులు ఆగిపోయాయని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా అడిషినల్ మున్సిపల్ కమిషనర్ ఎస్‌వీఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మెట్రో బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కేబుల్ వైర్లను పగటి పూట కూడా ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తొలగించడంలో ఎంఎంఆర్డీఏ అధికారులు విజయం సాధించారన్నారు. అయితే ఇదే తరహాలో ఇక్కడ వైర్లను తొలగించేందుకు అదనంగా మరో రూ.99.87 కోట్లు అవసరం ఉంటుందన్నారు. బ్రిడ్జి డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ సమ స్య చాలా క్లిష్టంగా ఉండడంతో పనులను కొనసాగించేందుకు తాజాగా టెండర్లను ఆహ్వానించి, కొత్త కాంట్రాక్టర్లచే పనులు ప్రారంభిస్తామన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement