శశికళపై కోర్టుల్లో పిటిషన్ల పరంపర | O Panneerselvam revolts shashikala natarajan | Sakshi
Sakshi News home page

శశికళపై కోర్టుల్లో పిటిషన్ల పరంపర

Feb 10 2017 4:15 AM | Updated on May 24 2018 12:08 PM

ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న శశికళపై పిటిషన్ల పరంపర కొనసాగుతోంది. శశికళ మద్దతుదారులు నిర్బంధించిన అన్నాడీఎంకే

సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న శశికళపై పిటిషన్ల పరంపర కొనసాగుతోంది. శశికళ మద్దతుదారులు నిర్బంధించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు విముక్తి కలిగించేలా ఆదేశాలి వ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో, ఆస్తుల కేసులో తీర్పు వెలువడే వరకు ప్రమా ణ స్వీకారంపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్లు దాఖల య్యాయి. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించిన నేపథ్యంలో.. కున్నమ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రన్‌ కనపడడం లేదని, ఆయన జాడ కనిపెట్టి, న్యాయస్థానంలో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఇలవరసన్‌ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇదిలా ఉండగా, మద్రాసు హైకోర్టు న్యాయవాది కె.బాలు, సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్‌’ రామస్వామి గురువారం వేర్వేరుగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ముందు హాజరై అన్నాడీఎంకేకు చెందిన 130 ఎమ్మెల్యేలను  విడిపించి, కోర్టులో హాజరు పర్చేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ... ఎమ్మె ల్యేలు కిడ్నాప్‌నకు గురికాలేదని, ఇంటివద్దనే సురక్షితంగా ఉన్నారని వాదించారు. డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు స్పందిస్తూ... ఎమ్మె ల్యేల కిడ్నాప్‌ అంశంపై పిటిషన్‌ దాఖలు చేస్తేనే విచారణ చేపట్టగలమని అన్నారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.  

సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌
శశికళ సీఎంగా బాధ్యతలు చేపట్టకుండా నిషేధం విధించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన చట్ట పంచాయిత్తు ఇయక్కం తరఫున సెంథిల్‌కుమార్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేశాడు. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడేవరకూ సీఎంగా శశికళ బాధ్యతలు స్వీకరించకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement