చెరువులో తల్లీబిడ్డల మృతదేహాలు | mother and her children dead bodies found in pond | Sakshi
Sakshi News home page

చెరువులో తల్లీబిడ్డల మృతదేహాలు

Sep 12 2017 9:38 AM | Updated on Sep 17 2018 8:02 PM

చెరువులో తేలిన తల్లీపిల్లల మృతదేహాలు - Sakshi

చెరువులో తేలిన తల్లీపిల్లల మృతదేహాలు

అనుమానాస్పద రీతిలో తల్లి, ఇద్దరు బిడ్డల మృతదేహాలు సోమవారం సాయంత్రం తాలూకాలోని శెట్టిమాదమంగల చెరువులో బయటపడ్డాయి.

కోలారు తాలూకాలో విషాదం
కొద్దిరోజుల కిందటే మిస్సింగ్‌ కేసు


కోలారు : అనుమానాస్పద రీతిలో తల్లి, ఇద్దరు బిడ్డల మృతదేహాలు సోమవారం సాయంత్రం తాలూకాలోని శెట్టిమాదమంగల చెరువులో బయటపడ్డాయి. మృతురాలిని జ్యోతి (32)గా గుర్తించారు. మాలూరు తాలూకాలోని వీరకపుత్ర గ్రామంలోని తన పుట్టి నింటిలో నివాసం ఉంటోంది. 4 సంవత్సరాల కుమారుడు, రెండున్నర సంవత్సరాల కుమార్తెతో కలిసి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. శవాలు నీటిపై తేలుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు,.

చెరువు గట్టుపైనే ఒ పొదలో మృతురాలు జ్యోతి చెప్పులు, బట్టల బ్యాగ్‌ కనిపించింది. ఘటన ఆత్మహత్య లేదా హత్యా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాస్తి పోలీస్‌ స్టేషన్‌లో కొద్దిరోజుల క్రితం జ్యోతి ఇద్దరు పిల్లలతో కనిపించడం లేదని ఫిర్యాదు నమోదైంది. బంధువులు వారి మృతదేహాలను గుర్తించారు. జ్యోతికి ఐదేళ్ల క్రితం చిక్కబళ్లాపురం జిల్లా గుడిబండకు చెందిన గోవిందప్పతో వివాహమైంది. కుటుంబ కలహాలతో పుట్టింటికి చేరుకుంది.

గత ఆదివారం భర్త ఇంటికి వెళతానని పుట్టినింటిలో చెప్పి వెళ్లిపోయింది. అయితే భర్త ఇంటికి కూడా వెళ్లక పోవడంతో తల్లి రెడ్డమ్మ మాస్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా, కోలారు రూరల్‌ ఇన్స్‌పెక్టర్‌ శివరాజ్‌ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శవాలను వెలికి తీసి పోస్టు మార్టం కోసం కోలారు ఎస్‌ఎన్‌ఆర్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement