వానరమూక చేసిన దాడి నుంచి ఆ పశువుల కాపరి ఎలాగోలా తప్పించుకున్నాడు.
కోతుల దాడి..గుండెపోటుతో వ్యక్తి మృతి
Sep 10 2016 8:04 PM | Updated on Sep 4 2017 12:58 PM
ముస్తాబాద్: వానరమూక చేసిన దాడి నుంచి ఆ పశువుల కాపరి ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన కర్నె వెంకటి(52) శనివారం పశువులను మేపేందుకు గ్రామ శివారులోకి వెళ్లాడు. అక్కడ గుట్టల ప్రాంతంలో కోతులు గుంపుగా వచ్చి వెంకటిపై దాడి చేశాయి. స్వల్ప గాయాలకు గురైన వెంకటి గ్రామస్తులకు ఫోన్ చేశాడు. వారు అతడిని ముస్తాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. కోతుల దాడితో తీవ్ర భయాందోళనలకు గురైన వెంకటి గుండెపోటుతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. అతనికి భార్య మణెవ్వ, కూతురు లక్ష్మి ఉన్నారు.
Advertisement
Advertisement