బాధితులకు ‘జాక్’ బాసట | modulating demand in ambedkar colony | Sakshi
Sakshi News home page

బాధితులకు ‘జాక్’ బాసట

May 31 2014 10:27 PM | Updated on Apr 7 2019 3:47 PM

బాధితులకు ‘జాక్’ బాసట - Sakshi

బాధితులకు ‘జాక్’ బాసట

ఎంతో మంది పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తూ బీఎంసీ అధికారులు తూర్పు ములుండ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌నగర్‌లో 130 గుడిసెలను కూలగొట్టడంపై ముంబై తెలంగాణ జాక్ (ఎంటీ జాక్) ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంబేద్కర్ కాలనీ క్రమబద్ధీకరణకు డిమాండ్
 
సాక్షి, ముంబై: ఎంతో మంది పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తూ బీఎంసీ అధికారులు తూర్పు ములుండ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌నగర్‌లో 130 గుడిసెలను కూలగొట్టడంపై ముంబై తెలంగాణ జాక్ (ఎంటీ జాక్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా నోటీసులు ఇవ్వకుండానే డెవలపర్లు ఈ నెల 21న ఈ గుడిసెలను నేలమట్టం చేశారు. మురికివాడల సంరక్షణ చట్టానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2000 సంవత్సరం కంటే ముందు వేసుకున్న గుడిసెలను క్రమబద్ధీకరించి సదుపాయాలు కల్పిస్తారు.
 
 ఈ చట్టం ముంబైలోని మూడు లక్షల గుడిసెలను రక్షిస్తుందన్న అంచనా. అంబేద్కర్‌నగర్ కాలనీవాసులకుకూడా ఈ చట్టం ఎందుకు వర్తింపజేయడం లేదని జాక్ ప్రశ్నించింది. ఇక్కడున్న ప్రతి గుడిసెను 2000 కంటే ముందే నిర్మించారని స్పష్టం చేసింది. వీళ్లంతా 1985 నుంచే ఇక్కడ నివసిస్తున్నట్టు నిరూపించగల పత్రాలూ ఉన్నందున, కూల్చివేతలు చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. తమకు అదే స్థలంలోనే తిరిగి ఇళ్లు కట్టించాలి లేదా ప్రత్యామ్నాయం చూపెట్టాలనే డిమాండ్‌తో బాధితులు గత నెల 21 నుంచి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు.
 
వీరిలో ఇరవై శాతం తెలుగు ప్రజలు. అంబేద్కర్‌నగర్ వాసుల న్యాయపరమైన పోరాటానికి ‘ఘర్ బచావ్-ఘర్ బనావ్ ఆందోళన్’ సంస్ధ నాయకురాళ్లు మేథా పాట్కర్, పూనం కనోడియా నాయక త్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంటీ జాక్ సభ్యులు శుక్రవారం సాయంత్రం ఘటనాస్థలానికి వెళ్లి నిర్వాసితులకు మద్దతు ప్రకటించారు. ములుండ్, భాండుప్ ప్రాంతాల్లోని తెలుగువారితోపాటు త్వరలోనే దీక్షలో పాల్గొంటామని ‘జాక్’ కన్వీనర్ బి. ద్రవిడ్ మాదిగ, గాది లక్ష్మణ్ తెలిపారు. ముంబైలోని ఇతర తెలుగు సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement