'బీసీ గురుకులాల‍్లో ఖాళీలు పూరిస్తాం' | minister jogu ramanna speaks on welfare schools | Sakshi
Sakshi News home page

'బీసీ గురుకులాల‍్లో ఖాళీలు పూరిస్తాం'

Mar 18 2017 2:31 PM | Updated on Aug 11 2018 6:42 PM

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోయే బీసీ గురుకుల విద్యాలయాల్లో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు.

హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోయే బీసీ గురుకుల విద్యాలయాల్లో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. శనివారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇందులో 56 బాలురు, 63 బాలికల గురుకులాలను నిర్మిస్తామని తెలిపారు. బీసీ గురుకులాల ఏర్పాటుకు స్థలాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement