పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
సంతానం లేదని..
Dec 23 2016 3:34 PM | Updated on Sep 4 2017 11:26 PM
భువనగిరి: పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బిక్షపతి, లలిత(37) దంపతులకు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి సంతానం లేదు. దీంతో గత కొన్ని రోజులుగా కుమిలిపోతున్న లలిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement