పెళ్లికి 300 మందికి మించి వస్తే ... | Marriage registration to be made compulsory | Sakshi
Sakshi News home page

పెళ్లికి 300 మందికి మించి వస్తే ...

Nov 21 2015 10:05 AM | Updated on Sep 3 2017 12:49 PM

పెళ్లికి 300 మందికి మించి వస్తే ...

పెళ్లికి 300 మందికి మించి వస్తే ...

లక్షలు... కోట్ల రూపాయలు... ఖర్చు చేసి ధూంధాం... అంటూ పెళ్లి చేసుకుంటామంటే ఇక కుదరకపోవచ్చు.

ఇకపై ఆడంబరాల వివాహాలకు చెల్లుచీటి!
ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్న ప్రభుత్వం

బెంగళూరు : లక్షలు... కోట్ల రూపాయలు... ఖర్చు చేసి ధూంధాం... అంటూ పెళ్లి చేసుకుంటామంటే ఇక కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆడంబరాల పెళ్లిళ్లకు అడ్డుకట్ట వేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లును శాసనసభలో సభ్యుల అనుమతి కోసం ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలో విమర్శలు చెలరేగుతున్నాయి. కాగా, ఈ ముసాయిదా బిల్లులో కొన్ని ముఖ్య నిబంధనలు....

*కల్యాణ మండపం అద్దె రూ. 50 వేలకు మించకూడదు
*అతిథిలు 300కు కంటే ఎక్కువ మంది హాజరుకాకూడదు
*పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
*నిబంధనలు ఉల్లంఘిస్తే వధూవరుల తల్లిదండ్రుల నుంచి అపరాధ రుసుమును వసూలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement