జాతీయ జెండాకు బదులు నల్లజెండా.. | malkangiri maoists hosting black flag in government school | Sakshi
Sakshi News home page

మల్కన్‌గిరి జిల్లాలో ఎగిరిన నల్లజెండా

Jan 27 2018 10:13 AM | Updated on Oct 9 2018 2:53 PM

malkangiri maoists hosting black flag in government school - Sakshi

ఏప్పులూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎగురుతున్న నల్లజెండా

మల్కన్‌గిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరనీయకుండా మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి పప్పులూర్‌ ప్రాథమిక పాఠశాలలో మావోయిస్టులు నల్లజెండాను ఎగురవేశారు. జెండా ఎగుర వేసిన ప్రాంతంలో మావోయిస్టులు పోస్టర్లు అతికించారు.  

ఈ నల్ల జెండాను ఎవరైనా తీసివేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోస్టర్లలో హెచ్చరించారు. బీజేపీ, బీజేడీ ప్రభుత్వాలు గిరిజనులకు ఎటువంటి మేలూ చేయడం లేదు. గిరిజనుల కోసమే అభివృద్ధి పథకాలు అంటూ నే వాటిని  గిరిజనులకు అందనీయడం లేదు. ఏ ఒక్క రాజకీయ నేత కూడా గిరిజన ప్రాంతా లకు వస్తున్న దాఖలాలు లేవు. అధికారుల వల్ల కూడా గిరిజనులకు ఒరిగేదేమీ లేదని మావోయిస్టులు పోస్టర్లలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement