అర లీటర్‌ ప్యాకెట్‌లో 420 ఎంఎల్‌ పాలు ! | less quantity over printed Heritage milk packets cought in tamilnadu | Sakshi
Sakshi News home page

అర లీటర్‌ ప్యాకెట్‌లో 420 ఎంఎల్‌ పాలు !

Jul 17 2016 7:17 PM | Updated on Sep 4 2017 5:07 AM

అర లీటర్‌ ప్యాకెట్‌లో 420 ఎంఎల్‌ పాలు !

అర లీటర్‌ ప్యాకెట్‌లో 420 ఎంఎల్‌ పాలు !

హెరిటేజ్‌ డెయిరీ వినియోగదారులను నిండా ముంచుతోంది.

హొసూరు (తమిళనాడు): హెరిటేజ్‌ డెయిరీ వినియోగదారులను నిండా ముంచుతోంది. ప్యాకెట్‌పై 500 ఎంఎల్‌ అని ముద్రిస్తున్నా, అందులో మాత్రం ఆ మేరకు పాలు ఉండడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమిళనాడులోని  క్రిష్ణగిరి జిల్లా హొసూరుకు చెందిన శ్రీనివాసన్‌ శనివారం ఉదయం హెరిటేజ్‌ దుకాణంలో అర లీటర్‌ పాకెట్లు రెండు కొనుగోలు చేశాడు.

ఒక పాకెట్‌లో పాలు తక్కువగా ఉండటంతో దుకాణదారుడిని ప్రశ్నించాడు. అయితే సదరు  దుకాణదారుడు తనకు సంబంధం లేదని, కర్ణాటక నుంచి పాకెట్లు ఎలా వస్తే తాము అలాగే విక్రయిస్తున్నట్లు దబాయించాడు.  ఒక ప్యాకెట్లో 500 ఎంఎల్, మరో పాకెట్‌లో 420 ఎంఎల్‌ మాత్రమే ఉందని, తాను వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయనున్నట్లు శ్రీనివాసన్‌ తెలిపారు. తమిళనాడు, కర్ణాటకలో హెరిటేజ్‌ లీలలపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement