పోలీసుల వేతనాలు పెంపు ! | karnataka police salary hike | Sakshi
Sakshi News home page

పోలీసుల వేతనాలు పెంపు !

Sep 2 2016 11:28 AM | Updated on Sep 4 2017 12:01 PM

ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పోలీసుల డిమాండ్లలో ఒకటైన వేతనాల పెంపు పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

10 నుంచి15 శాతం వరకు పెరిగే అవకాశం

బెంగళూరు: ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పోలీసుల డిమాండ్లలో ఒకటైన వేతనాల పెంపు పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే పోలీసుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించనుందని సమాచారం. పోలీసుల వేతనాలను 10నుంచి 15 శాతం వరకు పెంచేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ సూత్ర ప్రాయంగా అంగీకరించారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇందుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆర్థిక శాఖ వద్ద సైతం ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. వేతనాల పెంపుతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారానికి పోలీసులు గతంలో సమ్మెకు సిద్ధమైన విషయం తెలిసిందే.  ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈ వినాయక చవితి పండుగకు పోలీసులకు శుభవార్తను వినిపించనుందని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement