గిరిజన బాలికలకు స్కూళ్లలో కరాటే శిక్షణ | Karate training for tribal girls in TN schools | Sakshi
Sakshi News home page

గిరిజన బాలికలకు స్కూళ్లలో కరాటే శిక్షణ

Jul 17 2014 9:15 PM | Updated on Sep 2 2017 10:26 AM

గిరిజన బాలికలు తమకు ఎదురయ్యే ఆపదల నుంచి తమను తాము రక్షించుకోడానికి వీలుగా వారికి కరాటే శిక్షణ అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

గిరిజన బాలికలు తమకు ఎదురయ్యే ఆపదల నుంచి తమను తాము రక్షించుకోడానికి వీలుగా వారికి కరాటే శిక్షణ అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వాళ్లు చదువుకునే స్కూళ్లలోనే ఈ శిక్షణ ఇస్తారు. ముందుగా గిరిజన జనాభా ఎక్కువగా ఉండే నీలగిరి, నమక్కల్, సేలం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి కేసీ వీరమణి అసెంబ్లీలో తెలిపారు.

482 పాఠశాలల్లో చదువుతున్న 4,782 మంది అమ్మాయిలకు రూ. 14 లక్షల ఖర్చుతో ప్రాథమికంగా శిక్షణ ఇస్తారు. మరోవైపు, 2014-15 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా పరికరాల కొనుగోళ్లకు రూ. 20 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement