పవన్ అభిమాని హత్యకేసులో అక్షయ్ అరెస్ట్ | Jr NTR fan stabs Pawan Kalyan fan to death:Akshay Kumar arrested | Sakshi
Sakshi News home page

పవన్ అభిమాని హత్యకేసులో అక్షయ్ అరెస్ట్

Aug 25 2016 4:28 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ అభిమాని హత్యకేసులో అక్షయ్ అరెస్ట్ - Sakshi

పవన్ అభిమాని హత్యకేసులో అక్షయ్ అరెస్ట్

పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరు: పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపురం నందిని దాబా వద్ద అతడిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్షయ్తో పాటు మరో ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ హత్య కేసులో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు పోలీసులు నిర్థారించారు. కాగా ఈ నెల 21న కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో కత్తిపోట్లకు గురై మరణించిన  అభిమాని వినోద్‌ రాయల్ కుటుంబాన్ని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఇవాళ తిరుపతిలో పరామర్శించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement