థానిక బెంగళూరు రోడ్డులోని జ్యువెలరీ దుకాణంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకొని పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక బెంగళూరు రోడ్డులోని జ్యువెలరీ దుకాణంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకొని పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. పోలీసుల కథనంమేరకు.. నగరానికి చెందిన బసవరాజ్ అనే వ్యక్తి శ్రీలక్ష్మీ గోల్డ్ ప్యాలెస్ అనే జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఉన్న ఫళంగా దుకాణంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకొని మంటలు చెలరేగాయి. క్షణాల్లో దుకాణమంతా వ్యాప్తించడంతో భయాందోళనకుగురైన సిబ్బంది కేకలువేస్తూ బయటకు పరుగులు తీశారు.
సమీపంలోని దుకాణాలవారు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. అగ్ని మాపక దళం ఘటనా స్థలానికి చేరుకొనిమంటలను ఆర్పివేశారు. అప్పటికే రూ.10 లక్షల మేర ఫర్నీచర్, వస్తువులు కాలి బూడిద అయ్యాయని షాపు యజమాని పేర్కొన్నారు. జ్యువెలరీ వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సోని, సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి ధైర్యం చెప్పారు.