ఒక్క రూపాయికే చీర | jds party fan sale saree only one rupee in bidar | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయికే చీర

Jan 22 2018 6:58 AM | Updated on Jan 22 2018 6:58 AM

jds party fan sale saree only one rupee in bidar - Sakshi

షాపు వద్ద బారులు, (ఇన్‌సెట్లో) లోపల...

సాక్షి, బెంగళూరు, బళ్లారి: మామూలుగానైతే ఒక్క రూపాయికి ఏం వస్తుంది? పిప్పరమెంటు, చాక్లెట్టు, లేదా బిస్కెట్లో వస్తుంది. రూపాయికి విలువ  లేని ఈ రోజుల్లో ఒక్కరూపాయికే చీర కావాలా?? అయితే బీదర్‌కు వెళ్లాల్సిందే. చీర కావాలంటే ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. అసలు విషయం ఏమిటంటే బీదర్‌కు చెందిన ఒక చీరల దుకాణం యజమాని చంద్రశేఖర్‌  జేడీఎస్‌ పార్టీకి వీరాభిమాని. 2018లో జరిగే శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి విజయం సాధించి తీరాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ ఒక్క రూపాయికి చీర స్కీమును ప్రారంభించాడు. ఈ ఆఫర్‌ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో మహిళలు దుకాణం ముందు క్యూ కట్టారు.

తిరుమల వెంకటేశ్వరుడు కలలో చెప్పాడట : దీనిపై షాపు యజమానిని మీడియా ప్రశ్నిస్తే తన అభిమాన నాయకుడు కుమారస్వామి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే 5 లక్షల చీరలను పంచాలని కొద్దిరోజుల క్రితం తిరుమల వేంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పినట్లు చంద్రశేఖర్‌ తెలిపాడు. ఏడుకొండలవాని ఆదేశాల మేరకే తాను ఒక్క రూపాయికి చీర స్కీమును చేపట్టానన్నాడు. ఈసారి ఆరునూరైన తమ నాయకుడు ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement