కార్మికుల నోట్లో మట్టి కొట్టిన ’బాబు’ | I hit the clay workers 'Babu' | Sakshi
Sakshi News home page

కార్మికుల నోట్లో మట్టి కొట్టిన ’బాబు’

Apr 22 2014 2:31 AM | Updated on Jul 28 2018 6:33 PM

నిత్యం కరువు కాటకాలతో సతమతమవుతున్న జిల్లా ప్రజలు ఆర్థికంగా ఎదుగటానికి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ృషి చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు హయాంలో...

  • ‘అనంత’లో పరిశ్రమలన్నీ ఆయన హయాంలోనే మూత
  •  వైఎస్ హయాంలో పరిశ్రమలకు పునరుజ్జీవం
  •  సాక్షి, అనంతపురం : నిత్యం కరువు కాటకాలతో సతమతమవుతున్న జిల్లా ప్రజలు ఆర్థికంగా ఎదుగటానికి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ృషి చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న పరిశ్రమలను కూడా మూసేసి కార్మికుల నోట్లో మట్టికొట్టారు. దీంతో కార్మికులందరూ రోడ్ల మీద పడి జీవనోపాధి కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి కుటుంబాలకు దూరమయ్యారు.

    నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూపురం నియోజకవర్గంలోని తూముకుంట వద్ద దాదాపు 56 పరిశ్రమలు నెలకొల్పితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించకపోవడంతో వాటిలో దాదాపు 40 పరిశ్రమల వరకు మూతపడ్డాయి. పరిగి వద్ద దాదాపు 150 ఎకరాల్లో ప్రభుత్వ సంస్థగా నడుస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని అతి తక్కువ ధరకు బెంగళూరుకు చెందిన రేణుక షుగర్స్‌కు కట్టబెట్టారు.

    నిజాం షుగర్ ఫ్యాక్టరీని విక్రయించకూడదని అప్పట్లో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో గట్టి బందోబస్తు మధ్య ఫ్యాక్టరీలో వున్న పెద్ద పెద్ద యంత్రాలు తరలించేందుకు చంద్రబాబు సహకరించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పరిశ్రమలను మూయించి ప్రజాగ్రహానికి గురై అధికారానికి దూరమయ్యారు.
     
    జిల్లాలో అక్కడక్కడ ఉన్న పరిశ్రమలను చంద్రబాబు హయాంలో ఒక్కొక్కటిగా మూసేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు, పరిగి వద్ద వున్న చక్కెర ఫ్యాక్టరీ, మళుగూరు వద్ద ఉన్న ఐరన్ ఫ్యాక్టరీ, అనంతపురం శివారులో 23 ఎకరాల్లో వున్న డాల్డా ఫ్యాక్టరీ, ఏపీ లైటింగ్, పెనుకొండ వద్ద ఆల్విన్ కంపెనీ, రామగిరిలో బంగారు గనుల పరిశ్రమలు మూతపడ్డాయి.

    ఇక హిందూపురం నియోజకవర్గం తూముకుంట వద్ద ఉన్న 56 పరిశ్రమల్లో ప్రస్తుతం అక్కడున్న వాటిని వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. కేవలం నీటి సదుపాయం లేకపోవడంతోనే పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలుసుకొని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దాదాపు 350 కిలోమీటర్ల పొడవున పీఏబీఆర్ డ్యాం నుంచి పైప్‌లైన్ వేసి పరిశ్రమలకు నీళ్లు ఇచ్చేందుకు ృషి చేశారు. దీంతో బాబు హయాంలో మూత పడిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా తెరుచుకునే సమయంలో వైఎస్ వృతి చెందారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం తిరిగి అదే పరిస్థితి నెలకొంది.
     
    పరిశ్రమల మూతతో ఉపాధి కోల్పోయిన కార్మికులు
     
    నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూత పడటం కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 15 వేల మంది కార్మికులు ఉన్నట్లుండి ఉపాధి కోల్పోయారు. గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు మూత పడటంతో ఉపాధి లేక దాదాపు 20 వేల మంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. పెనుకొండలో వున్న ఆల్విన్ కంపెనీ మూత పడటంతో దాదాపు 3 వేల మంది ఉపాధి కోల్పోయారు. దేశంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 23 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతుంటే కనీసం నూనె ఉత్పిత్తి కర్మాగారాలు ఏర్పాటు చేయడంలో కూడా పాలకులు శ్రద్ధ చూపలేక పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement