నేనొక అందమైన శిల్పాన్ని | i am a Beautiful sculpture says Kajal Agarwal | Sakshi
Sakshi News home page

నేనొక అందమైన శిల్పాన్ని

May 1 2015 2:14 AM | Updated on Sep 3 2017 1:10 AM

నేనొక అందమైన శిల్పాన్ని

నేనొక అందమైన శిల్పాన్ని

నేనొక అందమైన శిల్పాన్ని అని అంటోంది నటి కాజల్ అగర్వాల్. తెలుగులో ఓ చందమామ,

నేనొక అందమైన శిల్పాన్ని అని అంటోంది నటి కాజల్ అగర్వాల్. తెలుగులో ఓ చందమామ, ఓ మగధీర, ఓ బిజినెస్ మ్యాన్ చిత్రాల్లో కాజల్ అగర్వాల్ అందమైన నగుమోము ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా గూడుకట్టుకుంది. ఇక కోలీవుడ్‌లో తొలి రోజుల్లో సరైన ఆదరణ లభించకపోయినా నాన్‌అవన్ అల్ల, తుపాకీ, జిల్లా చిత్రాలు ఈమెకు చక్కని విజయాలను కట్టబెట్టాయి. ఇక్కడి ప్రేక్షకులు కాజల్ అందానికి సమ్మోహనం అయ్యారు.
 
 అంతేకాదు ప్రస్తుతం కోలీవుడ్‌నే కాజల్‌ను అక్కున చేర్చుకుంది. ఇప్పుడీ బ్యూటీ ధనుష్ సరసన మారి, విశాల్‌కు జంటగా పాయుంపులి చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో విక్రమ్‌తోనూ జోడి కట్టబోతున్నారు. ఇలా తమిళ చిత్రాల అవకాశాలు వరుసగా తలుపుతడుతుండడంతో సంబరపడి పోతున్నారు. కాజల్ తనొక అందమైన శిల్పంతో పోల్చుకుంటున్నారు.
 
 అదేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. గొప్ప శిల్పులు లాంటి వారు రూపొందించిన చిత్రాలతో నేను ఒక అందమైన శిల్పం అయ్యాను. నేను సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చాను.  నేనూహించని విధంగా ఇన్నేళ్లుగా ప్రముఖ హీరోయిన్‌గా రాణిస్తున్నాను. నేను ఒక ప్రముఖ నటినని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను. అంతేకాదు నటిగా కాకుండా ఒక విద్యార్థినిగా పలు విషయాలు తెలుసుకుంటున్నానని భవిష్యత్తులో ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement