నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌ | huge cash surrendered in kurnool district and three men arrested | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌

Dec 11 2016 3:04 PM | Updated on Aug 28 2018 7:15 PM

నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌ - Sakshi

నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌

నోట్ల మార్పిడి ముఠాను కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు

- రూ.12 లక్షల 2వేల నోట్లు పట్టివేత
- ఇన్నోవా వాహనం, కౌంటింగ్‌ మిషన్‌ స్వాధీనం
- నిందితుల్లో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే సమీప బంధువు
 
ఆత్మకూరురూరల్: నోట్ల మార్పిడి ముఠాను కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన రూ. 2వేల నోట్లను పట్టుకున్నారు. ఇన్నోవా వాహనం..కౌంటింగ్‌ మిషన్‌ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందుల్లో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే సమీప బంధువు. ఆ వివరాలను డీఎస్పీ సుప్రజ విలేకరులకు వివరించారు. ఏపీ 21బీబీ4949 అనే నంబరు గల ఇన్నోవా వాహనంలో నోట్ల మార్పిడి ముఠా ఒకటి  తిరుగుతోందని.. ఈనెల 9వతేదీన సమాచారం వచ్చిందన్నారు. ఓంకారం సమీపంలో ఇన్నోవాను స్వాధీనం చేసుకొని తనిఖీలు చేయగా.. అందులో రూ.12 లక్షల కొత్త రెండువేల నోట్లు, అంతేగాక నోట్లను లెక్కించే యంత్రం దొరికాయన్నారు. బనగానపల్లెకు చెందిన కోడూరు రవితేజారెడ్డి, సంజీవగౌడులు అదుపులోకి తీసుకొని విచారించగా.. భాస్కర్, సుధాకర్‌ అనే వ్యక్తులు పారి పోయినట్లు చెప్పారని వివరించారు. నిందితుల వద్ద దొరికిన డబ్బుకు సరైన ఆ«ధారాలు చూపనందున..దానిని ఐటీ అధికారులకు అప్పగించనున్నామన్నారు. ముఠా అరెస్టులో చాకచక్యంగా వ్యవహరించిన ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు లోకేష్‌కుమార్, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, విష్ణు నారాయణలను డీఎస్పీ అభినందించారు.
టీడీపీ ఎమ్మెల్యే సమీప బంధువు..
నిందితుల్లో ఒకరైన రవితేజా రెడ్డి బనగానపల్లెకు చెందిన ప్రముఖ నెహ్రూ విద్యాసంస్థల డైరెక్టరు. ఇతను ఒక టీడీపీ శాసనసభ్యునికి  సమీప బ««ంధువు కావడం చర్చనీయాంశమైంది. ఆ శాసనసభ్యుడు నోట్ల మార్పిడి కేసు తీవ్రత తగ్గించేందుకు పలుమార్లు అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు నోట్లమార్పిడి నిందితులను మంచివారిగాను, పూర్వ నేర చరిత్ర లేని వారిగానూ, వారి తల్లిదండ్రుల గుణగణాలను పదపదేవల్లె వేశారు. ఏదో 10 శాతం కమీషన్‌కు కక్కుర్తిపడి కేసులో ఇరుక్కున్నారని సానుభూతి తెలపడం  చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement