మహిళలకు జల్లికట్టు | Sakshi
Sakshi News home page

మహిళలకు జల్లికట్టు

Published Wed, Jan 17 2018 6:11 AM

hen fights and jallikattu for woemn in selam - Sakshi

సేలం: నామక్కల్‌ జిల్లా, తిరుచెంగోడు ఇలంజర్‌ మండ్రం ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా మహిళలు, పిల్లలకు కోడి పందెం(మహిళల జల్లికట్టు) పోటీని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తిరుచెం గోడులోని నందవనం వీధిలో ఈ పోటీ నిర్వహించారు. ఇందులో ఒక వృత్తంలో ఒక కోడి పుంజు కాలిని ..మహిళ కాలిని తాడుతో కట్టి ఉంచుతారు. మహిళ కళ్లకు గంతలు కడతారు. ఆ మహిళ నిమిషంలోపు ఆ కోడి పుంజును పట్టుకోవాలి. ఈ పోటీల్లో విజేతలకు ఆసక్తికరమైన బహుమతులు అందజేశారు.ఈపోటీని మహిళల జల్లికట్టుగా పిలుస్తుండడం విశేషం.

రెక్లా రేసు.. నామక్కల్‌ జిల్లా, తిరుచెంగోడులోని సీహెచ్‌పీ కాలనీ, కొల్లపట్టి, కరట్టుపాళయం సానార్‌ పాళయం కమిటీల ఆధ్వర్యంలో పొంగల్‌ సందర్భంగా రెక్లా(గుర్రాల)పోటీలు నిర్వహించారు. పోటీల్లో సేలం, ఈ రోడ్, కోవై, తిరుచ్చి జిల్లాలకు చెందిన 42 గుర్రాలు పోటీ పడ్డాయి. ఇందులో ఏడు కి.మీ దూరం పందెం, 44 ఇంచుల ఎత్తు గుర్రాలు, పెద్ద గుర్రాలు, చిన్న గుర్రాలు వంటి నాలుగు విభాగాల పోటీల్లో యువకులు పాల్గొన్నారు. లండన్‌కు చెందిన యోగా శిక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

Advertisement
Advertisement