చాలా మంది రోమియోలను చూశాను | Hansika lover role in Romeo Juliet movie | Sakshi
Sakshi News home page

చాలా మంది రోమియోలను చూశాను

Mar 17 2015 12:27 AM | Updated on Sep 2 2017 10:56 PM

చాలా మంది రోమియోలను చూశాను

చాలా మంది రోమియోలను చూశాను

ఇప్పటి వరకు చాలా మంది రోమియోలను చూశానని నటి హన్సిక పేర్కొంది. నటుడు శింబుతో డీప్ లవ్‌లో పడ్డ హన్సిక పెళ్లి

ఇప్పటి వరకు చాలా మంది రోమియోలను చూశానని నటి హన్సిక పేర్కొంది. నటుడు శింబుతో డీప్ లవ్‌లో పడ్డ హన్సిక పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమై, చివరి క్షణాల్లో పటాపంచలు కావడంతో అప్‌సెట్ అయింది ఈ ఉత్తరాది భామ. దీంతో ఇక ప్రేమ లేదు. దోమా లేదు అంటూ నటన మీద దృష్టి పెట్టింది. అలాంటిది తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది. అదేమిటంటే.... చాలా మంది మగవాళ్లు, మేడి పండులాంటి వారు. పైకి అందంగా కనిపించే మేడి పండ్లు, విప్పి చూస్తే పురుగులు ఉంటాయి.
 
  చాలా మంది మగవాళ్లు కూడా అంతే. అందుకే మగ వారిని చూడగానే, ఒక నిర్ణయానికి రాకూడదంటారు. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసి, మగ వాళ్లు ఎలాంటి వారో చెప్పడం సాధ్యం కాదు. ప్రస్తుతం తాను రోమియో జూలియట్ చిత్రంలో ప్రేయసి పాత్రలో నటిస్తున్నానని పేర్కొన్నారు. నా వయసుకు తగ్గ పాత్రలు తమిళంలో లభించడం ఆనందంగా ఉందన్నారు. నేను ఇప్పటి వరకు చాలామంది రోమియోలను చూశాను. అయితే, వారిలో నిజమైన హీరోలు ఎవరు అన్నది కని పెట్టలేకపోయాను అని వెల్లడించింది. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడం హన్సిక లాంటి అందాల భామలకు పరిపాటిగా మారిందని కోలీవుడ్‌లో ప్రచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement