అజిత్‌కు జోడి హన్సిక కాదు | Hansika is not playing the female lead in Thala 56: Director | Sakshi
Sakshi News home page

అజిత్‌కు జోడి హన్సిక కాదు

Oct 29 2014 12:32 AM | Updated on Sep 2 2017 3:30 PM

అజిత్‌కు జోడి హన్సిక కాదు

అజిత్‌కు జోడి హన్సిక కాదు

నటుడు అజిత్‌తో రొమాన్స్ చేయాలన్నది హన్సిక చిరకాల వాంఛ అట. ఈ విషయాన్ని ఈ బ్యూటీనే ఒక సందర్భంలో వెల్లడించారు. అయితే ఈమె ఆశ నెరవేరబోతోందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది.

నటుడు అజిత్‌తో రొమాన్స్ చేయాలన్నది హన్సిక చిరకాల వాంఛ అట. ఈ విషయాన్ని ఈ బ్యూటీనే ఒక సందర్భంలో వెల్లడించారు. అయితే ఈమె ఆశ నెరవేరబోతోందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. హన్సిక కూడా ఖుషీగా ఉన్నట్లు సమాచారం. అయితే దర్శకుడు శివ ఆమె ఆశపై నీళ్లు చల్లారు. వివరాల్లో కెళితే.. వీరం వంటి విజయవంతమైన చిత్రం తరువాత దర్శకుడు శివ అజిత్ హీరోగా మరో చిత్రం తెరకెక్కించడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రంలో అజిత్ సరసన హన్సిక నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి హన్సికకు కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.
 
 దీంతో అజిత్ హన్సికల ఫ్రెష్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందనే టాక్ కోలీవుడ్‌లో జోరందుకుంది. ఇలాంటి వార్తలు దర్శకుడు శివ చెవికి తాకడంతో ఆయన స్పందించారు. ఆయన పేర్కొంటూ తన చిత్రంలో అజిత్ సరసన హన్సిక నటించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆమె ఈ చిత్రంలో నటించడం లేదని స్పష్టం చేశారు. నిజానికి ప్రస్తుతం కథ మాత్రమే రెడీ చేశానని హీరోయిన్, ఇతర నట వర్గం, సాంకేతిక బృందం ఎంపిక జరగలేదని పేర్కొన్నారు. అజిత్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇది అజిత్ 55వ చిత్రం. కాగా తదుపరి శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇది యాక్షన్ డ్రామా కథ చిత్రమేనని దర్శకుడు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement