మహాదాత చలమయ్య అస్తమయం

మహాదాత చలమయ్య అస్తమయం


బీచ్‌రోడ్‌ (విశాఖ): పారిశ్రామికవేత్త, ప్రముఖ దాత మట్టపల్లి చలమయ్య (94) సోమవారం కన్నుమూశారు. ఆయనకు శనివారం రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన రామ్‌నగర్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ, సోమవారం తెల్లవారుజామున 1.40 గంటల సమయం లో మరణించారు.   సోమవారం సాయంత్రం జరిగిన అంతిమ యాత్రలో అధిక సంఖ్యలో ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కాన్వెంట్‌ జంక్షన్‌లోని హిందూ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.1923 నవంబర్‌ 19న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో చలమయ్య జన్మించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకే చదువుకున్నా 17 ఏళ్ల ప్రాయంలోనే తండ్రికి అండగా వ్యాపార రంగంలోకి ప్రవేశించి ప్రముఖ పారిశ్రా మికవేత్తగా ఎదిగారు. 1941లో బర్మా నుంచి వలస వచ్చి, సామర్లకోట రైల్వేస్టేషన్‌కు చేరుకున్న శరణార్థులకు ప్రతిరోజు 5వేల మందికి అన్నం పెట్టి ఆకలి తీర్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top