రైలు ఇంజిన్‌లో పొగలు | fumes are came in train engine | Sakshi
Sakshi News home page

రైలు ఇంజిన్‌లో పొగలు

Sep 28 2016 2:11 AM | Updated on Sep 4 2017 3:14 PM

జోలార్‌పేట నుంచి ఈరోడ్‌కు పెరంబూర్ మార్గంలో వచ్చిన ప్యాసింజర్ రైలులో హఠాత్తుగా ఇంజిన్ నుంచి పొగలు ప్రారంభమయ్యా యి.

 కేకే.నగర్: జోలార్‌పేట నుంచి ఈరోడ్‌కు పెరంబూర్ మార్గంలో వచ్చిన ప్యాసింజర్ రైలులో హఠాత్తుగా ఇంజిన్ నుంచి పొగలు ప్రారంభమయ్యా యి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు గంటల తరువాత అధికారులు మరో ఇంజిన్‌ను రప్పించి రైలును నడిపారు. వే లూరు జిల్లా జోలార్‌పేట నుంచి ఈరోడ్‌కు ఉదయం 6.40 గంటలకు ప్యా సింజర్ రైలు బయలుదేరుతుంది.

ఎప్పటిలాగా మంగళవారం ఆరు గం టలకు జోలార్‌పేట నుంచి రైలు బయలుదేరింది. మోదాపూర్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో వస్తుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో నిలిచి పోయింది. ఇంకా ఇంజిను నుంచి పొగలు ప్రారంభమయ్యాయి. సమాచా రం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ముందు జాగ్రత్తగా నీటిని చల్లారు. తరువాత కొంతదూరం రైలును నడిపి వేరే మార్గంలో నిలిపారు. రెండు గంటల తరువాత మరో ఇంజిన్‌ను రప్పించి రైలును నడిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement