చనిపోయే ముందు వారందరి ప్రాణాలు నిలిపాడు!

Tamilnadu: RTC Driver Succumbs Due To Cardiac Arrest Avert Accident - Sakshi

గుండెపోటుతో బస్సు డ్రైవర్‌ మృతి

డ్రైవర్‌ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితం 

సేలం/తమిళనాడు: విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గుండెపోటుతో ఆదివారం మృతిచెందారు. గుండెనొప్పి రాగానే బస్సును డ్రైవర్‌ చాకచక్యంగా నిలిపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈరోడ్‌ జిల్లా కౌందంపాడికి చెందిన సెల్వరాజ్‌ (52) ప్రభుత్వ బస్సు డ్రైవర్‌. ఆదివారం ఉదయం 7.30 గంటలకు కౌందంపాడి నుంచి పెరుందురైకి 20 మంది ప్రయాణికులతో వెళుతున్నారు. మార్గమధ్యంలో సెల్వరాజ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో  బస్సును రోడ్డు పక్కన ఆపి కండక్టర్‌కి విషయం చెప్పాడు.

ప్రయాణికులు సెల్వరాజ్‌ను మరో వాహనంలో సిరువల్లూరు పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యు లు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. సిరు వల్లూరు పోలీసులు మృతదేహాన్ని గోపిచెట్టి పాళయం ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top