నీలగిరి కొండల్లో కార్చిచ్చు

Fire Accident At Meghamalai Hills Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు ఊటీలోని నీలగిరి కొండల్లో కార్చిచ్చు చెలరేగింది. ముదుమలై అటవీ ప్రాంతంలోని మేఘమలై కొండల్లో అగ్రి కీలలు ఎగసిపడుతున్నాయి. దాదాపు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి దగ్దమవుతుంది. ఆ ప్రాంతంలోని వన్యప్రాణులు కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. బలమైన గాలులు వీస్తుండటంతో మంటుల ఆర్పేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

పది రోజుల కిందట కూడా ముదుములై టైగర్‌ రిజర్వ్‌లో మంటలు చెలరేగగా 50 ఎకరాల అటవీ ప్రాంతం దగ్దమయింది. ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top