కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం అంకుషాపూర్‌లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది.
ఎలుగుబంటి దాడి: రైతుకు గాయాలు
Apr 6 2017 10:53 AM | Updated on Oct 1 2018 4:01 PM
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం అంకుషాపూర్‌లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామానికి చెందిన మల్లారెడ్డి గురువారం ఉదయం మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో చేనులో నక్కిఉన్న ఎలుగుబంటి మల్లారెడ్డిపై దాడికి దిగింది. ఎలుగుబంటి దాడిలో గాయాపడిన మల్లారెడ్డి దాని నుంచి తప్పించుకొని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. గ్రామ శివారులో ఎలుగు తిరుగుతుండటంతో గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు.
Advertisement
Advertisement