ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నకల్లో బ్యాలెట్ పేపర్‌పై దొర్లిన తప్పుల గురించి ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్పందించారు.
ఫోటోల తారుమారుపై స్పందించిన ఈసీ
Mar 9 2017 12:56 PM | Updated on Sep 3 2019 8:44 PM
హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నకల్లో బ్యాలెట్ పేపర్‌పై దొర్లిన తప్పుల గురించి ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్పందించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటో తారుమారు పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. మొదటి ప్రూఫ్‌లో కేవలం స్ఫెల్లింగ్ మిస్టేక్ మాత్రమే ఉంది. రెండో ప్రూఫ్‌లో ఫోటోలు తారుమారు అయ్యాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రెండవ ప్రూఫ్ నాటికి నేను విదేశి పర్యటనలో ఉన్నాను. అప్పుడు ఏమైందో తెలియాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై భన్వర్‌లాల్‌ను కలిసిన యూటీఎఫ్ నేతలు అధికార పార్టియే ఈ సంఘటనకు బాధ్యత వహించాలన్నారు. ఓడిపోతామనే ఇలాంటి చర్యలకు పాల్పడిందని రిపోలింగ్‌కు ఆదేశం ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
Advertisement
Advertisement