మత్తులో రైఫిల్‌తో చెలగాటం | Drunk constable misfires gun in karnataka | Sakshi
Sakshi News home page

మత్తులో రైఫిల్‌తో చెలగాటం

Sep 15 2016 8:22 AM | Updated on May 25 2018 2:06 PM

మత్తులో రైఫిల్‌తో చెలగాటం - Sakshi

మత్తులో రైఫిల్‌తో చెలగాటం

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఒకరు స్టేషన్‌లోని రైఫిల్‌తో ఆట్లాడుతుండగా బుల్లెట్లు కడుపులోకి దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు.

♦ పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు
♦ తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌


దొడ్డబళ్లాపు(బెంగళూరు)రం: పోలీస్‌ కానిస్టేబుల్‌ ఒకరు స్టేషన్‌లోని రైఫిల్‌తో ఆట్లాడుతుండగా బుల్లెట్లు కడుపులోకి దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన దేవనహళ్లి తాలూకా చెన్నరాయపట్టణ పోలీస్‌స్టేషన్లో చోటుచేసుకుంది. ఇక్కడ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌(40) స్టేషన్‌లో సెంట్రి డ్యూటీకి హాజరయ్యాడు.

రైఫిల్‌ తీసుకుని షూట్‌ చేసుకుంటున్నట్టు, పైకి ఎక్కిపెట్టినట్లు ఫొజులు ఇస్తుండగా ప్రమాద వశాత్తు మిస్‌ఫైర్‌ అయ్యి అతని పొట్టలోకి తూటా దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను బెంగళూరు కొలంబియా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్‌ చెన్నరాయపట్టణ పోలీస్‌స్టేషన్ను పరిశీలించి సిబ్బంది వద్ద సమాచారం తెలుసుకున్నారు. కాగా రమేష్‌ డ్యూటీకి హాజరైన సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు రైటర్, సిబ్బంది చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement