రజనీ, కమల్‌కు కర్ణాటక ఆహ్వానం | Dr Rajkumar Memorial Inauguration: Rajini, Kamal, Amitabh and Other Stars Likely to be Invited | Sakshi
Sakshi News home page

రజనీ, కమల్‌కు కర్ణాటక ఆహ్వానం

Oct 30 2014 2:45 AM | Updated on Sep 2 2017 3:34 PM

రజనీ, కమల్‌కు కర్ణాటక ఆహ్వానం

రజనీ, కమల్‌కు కర్ణాటక ఆహ్వానం

సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్‌లకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపింది. వివరాల్లోకి వెళితే కన్నడ కంఠీరవగా ఖ్యాతి ఘడించిన దివంగత నటుడు

సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్‌లకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపింది. వివరాల్లోకి వెళితే కన్నడ కంఠీరవగా ఖ్యాతి ఘడించిన దివంగత నటుడు రాజ్‌కుమార్ స్మారకార్థం కర్ణాటకలోని కంఠీరవ స్టూడియో ఆవరణాల్లోని రెండున్నర ఎకరాల్లో పెద్ద మండపాన్ని నిర్మించింది. రాజ్‌కుమార్ పుణ్యస్థలం పేరుతో నెలకొల్పిన ఈ ఆవరణలో800 మంది కూర్చుని తిలకించే విధంగా అందమైన ప్రాంగణాన్ని నిర్మించారు. చిన్న స్విమింగ్ పూల్‌తోపాటు సుందరమయిన పార్క్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అరుదైన రాజ్‌కుమార్ పాటలతో కూడిన ప్రదర్శన హాలును నెలకొల్పారు.
 
 మణిమండపంలో రాజ్‌కుమార్  శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాజ్‌కుమార్ పుణ్యస్థలం ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెల (నవంబర్) 29న భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ప్రారంభించనున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రజనీకాంత్, కమల్‌హాసన్‌ను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. అలాగే ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ను ఆహ్వానించింది. రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన నటి సరోజినీదేవి, షావుకారు జానకి తదితరులకు ఆహ్వానం పంపినట్లు రాష్ట్ర సమాచార, ప్రచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement