లోకేష్‌ను కలిసిన ధూళిపాళ్ల | dhulipalla narendra meets nara lokesh | Sakshi
Sakshi News home page

లోకేష్‌ను కలిసిన ధూళిపాళ్ల

Apr 4 2017 4:15 PM | Updated on Aug 29 2018 3:37 PM

లోకేష్‌ను కలిసిన ధూళిపాళ్ల - Sakshi

లోకేష్‌ను కలిసిన ధూళిపాళ్ల

మంత్రి నారా లోకేష్‌ను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కలుసుకున్నారు.

అమరావతి: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కలుసుకున్నారు. మంత్రివర్గంలో చేరిక, కీలక శాఖలు దక్కడంపై లోకేష్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేంద్రకు మంత్రి పదవి దక్కని అంశంపై ఇ‍ద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రిపదవి పొందేందుకు మీకు పూర్తి అర్హత ఉంది, కానీ సమీకరణల్లో సాధ్యపడలేదు అని ధూళిపాళ్లతో వ్యాఖ్యానించినట్లు, ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement