బళ్లారి సమగ్రాభివృద్ధి చెందాలంటే బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి శ్రీరాములు గెలుపుతోనే సాధ్యమవుతుందని కేఎంఎఫ్ అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి అన్నారు.
సాక్షి, బళ్లారి : బళ్లారి సమగ్రాభివృద్ధి చెందాలంటే బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి శ్రీరాములు గెలుపుతోనే సాధ్యమవుతుందని కేఎంఎఫ్ అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని పలు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
శ్రీరామనవమి సందర్భంగా బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బీ.శ్రీరాములు గెలుపొందాలని, నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావాలని, బళ్లారి సుభిక్షంగా ఉండాలని తన ఇష్టదైవం ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.
బళ్లారి సమగ్రాభివృద్ధి చెందాలంటే అది శ్రీరాములుతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు పదవులు తప్ప ప్రజాసంక్షేమం పట్టదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా శ్రీరాములు గెలుపును అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు తరుఫున మాజీ బుడా అధ్యక్షుడు గురులింగనగౌడ విస్తృత ప్రచారం చేశారు.
మూడు రోజుల నుంచి బళ్లారి తాలూకాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం హలకుంది, హొన్నళ్లి, హొన్నళ్లి తాండా, మించేరి, రూపనగుడి, సంగనకల్లు తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు.