16 స్థానాల్లో సాద్ (బాదల్) పోటీ | Delhi unit of SAD (Badal) says it wants to contest 16 seats | Sakshi
Sakshi News home page

16 స్థానాల్లో సాద్ (బాదల్) పోటీ

Oct 23 2013 12:21 AM | Updated on Sep 1 2017 11:52 PM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాలనుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు శిరోమణి అకాలీదళ్ ఢిల్లీ శాఖ ప్రకటించింది.

న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాలనుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు శిరోమణి అకాలీదళ్ ఢిల్లీ శాఖ ప్రకటించింది. అయితే తుదినిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ శాఖ ఒక తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు పంపింది. ఢిల్లీలో తమకు పట్టున్న 16 స్థానాల్లో సొంతంగా పోటీచేయాలని పార్టీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించామని మంగళవారం సాద్ ఢిల్లీ అధ్యక్షుడు మంజిత్ సింగ్ తెలిపారు. అయితే బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. సాద్ గతంలో ఢిల్లీలో బీజేపీతో పొత్తులో నాలుగు స్థానాలకు పోటీపడింది కాని అన్నింటా ఓటమి పాలైన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement