కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది.
జమ్మికుంట మార్కెట్‌కు భారీగా పత్తి
Feb 3 2017 12:48 PM | Updated on Oct 1 2018 2:09 PM
జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం 281 వాహనాల్లో లూజ్ పత్తి వచ్చింది. దీనికి గ్రేడింగ్ కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణలో రెండవ పెద్ద మార్కెట్ అయిన జమ్మికుంటతో పాటు కరీంనగర్‌లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘నామ్’ పద్ధతిన కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అయితే గ్రేడింగ్‌లో ఆలస్యం జరుగుతుండడం, ఆన్‌లైన్ చాంబర్‌లో నిర్ణయించే ధర ఎంత ఉంటుందో తెలియక రైతులు తమ సరకును గురువారం వ్యాపారులకు అమ్ముకున్నారు.
ఇది గమనించిన మార్కెట్ కమిటీ నేరుగా సరకు కొనుగోళ్లను కట్టడి చేయడంతో శుక్రవారం నాడు పత్తి భారీగా తరలివచ్చింది. దీంతో మార్కెట్ కళకళలాడుతోంది. కాగా, ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయిన వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో మాత్రం పాత పద్ధతి(వేలం)లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. అక్కడ శుక్రవారం రూ. 5409 ధర పలికింది.
Advertisement
Advertisement