దుర్గగుడిలో రూ.27 వేల ఫోన్ మాయం | cell phone robbery in durga temple in vijayawada | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో రూ.27 వేల ఫోన్ మాయం

Oct 9 2016 8:21 AM | Updated on Aug 30 2018 5:27 PM

దుర్గ గుడి వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య ఫోన్ శనివారం తెల్లవారుజామున మాయమైంది.

విజయవాడ : దుర్గ గుడి వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య ఫోన్ శనివారం తెల్లవారుజామున మాయమైంది. ఎంపీ కేశినేని నాని అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సమయంలో శంకర శాండిల్య ఆయనను అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. రూ.27,500 విలువైన ఫోన్‌ను పుస్తకంపై పెట్టి దర్శనానికి వెళ్లి వచ్చే సరికి మాయం అయింది.

వెంటనే ఆశీర్వచన మండపంలోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా, కెమెరాకు ఆలయంలో అలంకరించిన పూలు అడ్డురావడంతో ఆ దృశ్యాలు సృష్టంగా రికార్డు కాలేదు. ఫోన్ పోయిన విషయాన్ని శంకర శాండిల్య ఆలయ అధికారులకు తెలియజేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement