నోయిడా బంద్’ ప్రశాంతం | BJP leader`s killing: Party workers call for `Noida bandh` today | Sakshi
Sakshi News home page

నోయిడా బంద్’ ప్రశాంతం

Jun 9 2014 11:04 PM | Updated on Mar 29 2019 9:07 PM

బీజేపీ పిలుపు మేరకు సోమవారం ‘నోయిడా బంద్’ విజయవంతమైంది. దాద్రినగర్ పంచాయతీ చైర్‌పర్సన్ భర్త, బీజేపీ నాయకుడు అయిన విజయ్ పండిట్‌ను కొందరు దుండగులు ఆదివారం

గ్రేటర్ నోయిడా: బీజేపీ పిలుపు మేరకు సోమవారం ‘నోయిడా బంద్’ విజయవంతమైంది. దాద్రినగర్ పంచాయతీ చైర్‌పర్సన్ భర్త, బీజేపీ నాయకుడు అయిన విజయ్ పండిట్‌ను కొందరు దుండగులు ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హత్య విషయం తెలుసుకున్న పండిట్ కుటుం బసభ్యులు, బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టిం చారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జరపాల్సి వచ్చింది. అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కాగా, విజయ్ హత్యకు నిరసనగా నోయిడా, గ్రేటర్ నోయిడా, దాద్రి ప్రాంతాల్లో ‘నోయిడా బంద్’కు పిలుపుని చ్చారు. దీంతో వ్యాపారసంస్థలు, పాఠశాలలు, పలు ప్రైవేట్ సంస్థలు మూతపడ్డాయి. సెక్టార్ 18 మార్కెట్, 19వ సెక్టార్‌లోని అటా మార్కెట్‌లలో బీజేపీ కార్యకర్తలు కవాతు నిర్వహిం చారు.
 
 కాగా, సెక్టార్ 18లో మార్కెట్‌ను వ్యాపారస్తులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసి ఉంచారని సెక్టార్ 18 ట్రేడర్స్ అసోసియేషన్ ఎస్.కె.జైన్ తెలిపారు. గౌతమ్‌బుద్ధ్ నగర్ ఎంపీ మహేశ్ శర్మ మాట్లాడుతూ పోలీ సుల ఉదాసీనత వల్ల నేరాలు పెరిగిపోతుండటంతో నిరసనగా వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారని తెలిపారు. ఇదిలాఉండగా బాధిత కుటుంబసభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజ్‌పేయి సోమవారం పరామర్శించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణను జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా,  తన భర్త హత్య వెనుక స్థానిక ఎస్పీ నాయకుడు నరేందర్ భాటి హస్తముం దని హతుడి భార్య గీత ఆరోపించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే నలుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement