'కాంగ్రెస్ నేతల ఆవేదన ఎందుకో' | bjp leader k.laxman slams congress leaders over Surgical Strikes | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ నేతల ఆవేదన ఎందుకో'

Oct 20 2016 12:34 PM | Updated on Mar 29 2019 9:31 PM

'కాంగ్రెస్ నేతల ఆవేదన ఎందుకో' - Sakshi

'కాంగ్రెస్ నేతల ఆవేదన ఎందుకో'

సర్జికల్ దాడులపై కాంగ్రెస్ నేతలు ఆవేదన ఎందుకో అర్ధం కావడంలేదని బీజేపీ నేత కె.లక్ష్మణ్ అన్నారు.

హైదరాబాద్‌: భారతసైన్యం చేసిన మెరుపుదాడులను భారతీయులు హర్షిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీనాయకులు మాత్రం ఎందుకు ఆవేదన చెందుతున్నారో అర్ధం కావడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. మెరుపు దాడులను బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఇది సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా , దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ఏకాకి చేస్తుంటే.. కాంగ్రె స్ మాత్రం ఈ విషయం మీద రాజకీయం చేస్తోందని విమర్శించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఏకాకి అని.. కాంగ్రెస్ వ్యాఖ్యలను ప్రజలు పరిగణనలోకి తీసుకోరని ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement