పెళ్లి పేరుతో నమ్మించి బాలికపై అత్యాచారం | Believing raping a married name | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో నమ్మించి బాలికపై అత్యాచారం

Jan 19 2015 5:46 AM | Updated on Sep 2 2017 7:55 PM

పెళ్లి పేరుతో నమ్మించి బాలికపై అత్యాచారం

పెళ్లి పేరుతో నమ్మించి బాలికపై అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగమంగల తాలూకా శికారిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది.

మండ్య : పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగమంగల తాలూకా శికారిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు... గత ఏడాది డిసెంబర్ 25న శికారిపురకు చెందిన సంజయ్(28) అదే గ్రామానికి చెందిన బాలిక(14)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు.

ఈ విషయాన్ని ఇటీవల ఆ బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో గ్రామీణ పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తమం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సంజయ్‌ను అరెస్ట్ చేశారు. గతంలో సంజయ్‌కు ఓ యువతిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement