breaking news
Registered a case
-
హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై సీఐడీ
♦ దేవుని కడప పోలీసు హౌసింగ్ సొసైటీలో గోల్మాల్ ♦ రాజకీయాలకతీతంగా విచారణ జరిగేలా ప్రణాళిక ♦ ఇటీవలే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు ♦ కర్నూలు సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం సాక్షి కడప : పోలీసు హౌసింగ్ సొసైటీ గోల్మాల్ వ్యవహారాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. రాజకీయాలకతీతంగా.. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు భావిస్తున్న నేపథ్యంలో సీఐడీ(క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు)కి అప్పగించారు. అందుకు సంబంధించి కేసును సీఐడీకి అప్పగిస్తూ మంగళవారమే నిర్ణయం తీసుకున్నప్పటికి బుధవారం ఫైల్స్‌ను అందజేసినట్లు తెలుస్తోంది. కడప నగరంలోని దేవుని కడప పోలీస్ హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు పిర్యాదులు వెలువెత్తాయి. దీంతో ప్రస్తుత ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సీఐడీకి కేసును అప్పగించారు. కోట్లాది రూపాయల అక్రమాలు జరగడంతోనే.. జిల్లాలోని పోలీసులకు సంబంధించి 2004లో హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేవుని కడప ప్రాంతంలోని కొంత భూమిని పోలీసు సొసైటీకి కేటాయించారు. ఇందులో కానిస్టేబుల్ నుంచి ఎస్పీస్థాయి అధికారుల వరకు దాదాపు 440మందికి ఇళ్ల పట్టాలు నామమాత్రపు ధరతో అందజేశారు. ఈ వ్యవహారంలో కొంతమందికి ప్రత్యేక లబ్ధి జరిగిందని..రూ.కోట్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇటీవలే ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున పోలీసు వర్గాల్లో ప్రచారం జరగడంతోపాటు చర్చకు దారితీసిన నేపథ్యంలో ఇటీవలే ఒకరు కడపలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హౌసింగ్ సొసైటీ అక్రమాలపై పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కోట్లకు సంబంధించిన అక్రమాల వ్యవహారం కావడంతో ఈ కేసును సీఐడీకి అప్పగించాలని నిర్ణయించడంతోపాటు వన్‌టౌన్ సీఐ రమేష్‌తో కూడా జిల్లా ఎస్పీ రామకృష్ణ వివరాలపై ఆరా తీశారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాల వ్యవహారంలో ఏమి జరుగుతుందోనని ఒకపక్క పోలీసు వర్గాల్లో ఆసక్తి నెలకొనగా.. మరోపక్క అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో గుబులు రేపుతోంది. నేడో.. రేపో రంగంలో దిగనున్న సీఐడీ దేవుని కడప పోలీస్ హౌసింగ్ సొసైటీ వ్యవహారాన్ని కర్నూలు సీఐడీ పోలీసులకు అప్పగించడంతో త్వరలోనే బృందం కడపకు రానున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి రికార్డులను స్వాధీనం చేసుకోవడంతోపాటు పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు పెద్దఎత్తున రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నుంచి త్వరలోనే బృందం కడపకు వచ్చి విచారణ చేపట్టనుంది. హౌసింగ్ సొసైటీ వ్యవహారంపై సంబంధిత పోలీసు అధికారులతోపాటు బాధితులు, ఇతర అన్నివర్గాలతో కూపీ లాగనున్నట్లు సమాచారం. ఈ విషయమై హౌసింగ్ సొసైటీ అక్రమాల వ్యవహారాల కేసును సీఐడీకి అప్పగించినట్లు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ స్పష్టం చేశారు. -
ఔరా.. పావని..!
రూ.కోట్లకు పడగ చింటూ, బుల్లెట్ల వద్ద పలు పంచాయతీలు మరికొందరిపై కేసుల నమోదుకు రంగం సిద్ధం రూ.కోటి విలువైన స్థలాల గుర్తింపు పావని దంపతులకు ముగిసిన పోలీసు కస్టడీ చిత్తూరు (అర్బన్): పావని.. రెండేళ్ల క్రితం చీరలు అమ్ముతూ జనంలోకి వచ్చిన ఓ సాధారణ మహిళ. ఆమె భర్త చరణ్ ఆటో డ్రైవర్. ఆమె చుట్టుపక్కల వారినే కాకుండా పలు ప్రాంతాల వారిని మాయ మాటలతో పడేసింది. కిలోల లెక్కన బంగారు ఆభరణాలు, రూ.కోట్ల నగదు తీసుకుని చివరకు వారికి టోపీ పెట్టింది. పోలీసు కస్టడీలో ఆమె తెలిపిన వివరాలు విని పోలీసులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. తొమ్మిది రోజుల కస్టడీ గడువు పూర్తికావడంతో వారిని సోమవారం కోర్టు ఎదుట హాజరుపరచి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ విచారణలో పావని దంపతులు చెప్పిన వివరాల మేరకు పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. అత్యాశే పెట్టుబడి తమిళనాడుకు చెందిన పావని రెండేళ్ల క్రితం చిత్తూరు నగరం మిట్టూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం, చిన్న కిరాణ దుకాణం నిర్వహించడం మొదలుపెట్టింది. చుట్టు పక్కల మహిళల్ని లక్ష్యంగా చేసుకుని నూటికి రూ.పది చొప్పున వడ్డీ ఇస్తానని చెప్పి నగదు తీసుకుంది. సక్రమంగా వడ్డీ చెల్లిస్తూ నమ్మకం పెంచుకుంది. వారి అత్యాశను పెట్టుబడిగా మార్చుకుంది. నమ్మకమనే పేరిట పలువురు మహిళల నుంచి సుమారు 8.25 కిలోల బంగారు ఆభరణాలను సేకరించింది. వీటిని తాకట్టుపెట్టి సొమ్ము చేసుకుంది. దీనికి తోడు చీటీలు, చేతి బదులు, అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి రూ.1.85 కోట్ల వరకు తీసుకుంది. విదేశీ టూర్లు... ఇదే నమ్మకంతో చిత్తూరు నగరంలోని ఎస్టేట్‌కు చెందిన ఓఎం.రాందాస్ కుటుంబంతో పరిచయం పెంచుకుంది. నిత్యం ‘డాడీ.. డాడీ..’ అని వారిని పావని పిలిచేది. ఈ క్రమంలోనే వారితో కలిసి థాయ్‌లాండ్, సింగపూర్‌కు సైతం టూర్లకు వెళ్లింది. రాందాస్ కుమార్తె జ్యోత్స్నకు సైతం హాండిచ్చింది. ఇక చీటీల పేరిట రూ.1.83 కోట్లు అప్పులు చేసి న్యాయస్థానంలో ఐపీ దాఖలు చేసింది. ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థలో ఏకంగా 234 ఖాతాల్లో 8 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను కుదువపెట్టి సొమ్ము చేసుకుంది. డబ్బులు అడిగిన వారిని చింటూ వద్దకు పిలిపించి బెదిరించేది. ఇదే క్రమంలో చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్, ప్రియ అనే మహిళకు ఇవ్వాల్సిన ఆభరణాలు, నగలపై పంచాయతీ చేసినట్లు పావని దంపతులు పోలీసులకు వివరించారు. దీనిపై ఇప్పటికే పోలీసులు బుల్లెట్ సురేష్‌ను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. రూ.కోట్ల విలువైన స్థలాల గుర్తింపు పావని దంతపతులకు నగరంలోని ఎస్టేట్‌లో ఓ స్థలం, మురకంబట్టులో ఇంటిని గుర్తించారు. వీటి విలువ రూ.కోటి వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిపై చట్టపరంగా అటాచ్‌మెంట్‌కు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక పావని వద్ద ఉన్న ఇండికా, డస్టర్, రెండు టెంపో వాహనాలను ఫైనాన్స్ సంస్థలు ఇప్పటికే సీజ్ చేశాయి. తొలుత ఇద్దరు మహిళలు మాత్రమే పావనిపై ఫిర్యాదు చేయగా ప్రస్తుతం వారి సంఖ్య 15కు చేరింది. పావని దంపతులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. -
పెళ్లి పేరుతో నమ్మించి బాలికపై అత్యాచారం
మండ్య : పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగమంగల తాలూకా శికారిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు... గత ఏడాది డిసెంబర్ 25న శికారిపురకు చెందిన సంజయ్(28) అదే గ్రామానికి చెందిన బాలిక(14)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఇటీవల ఆ బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో గ్రామీణ పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తమం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సంజయ్‌ను అరెస్ట్ చేశారు. గతంలో సంజయ్‌కు ఓ యువతిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చినట్లు సమాచారం. -
సెంట్రల్ ముంబైలో ఉద్రిక్తత
* ఇరు వర్గాల మధ్య ఘర్షణ * ఏడుగురికి గాయాలు, ఒక బైక్ ధ్వంసం * 50 మందిపై కేసు నమోదు సాక్షి, ముంబై: సెంట్రల్ ముంబైలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఏడుగురు గాయపడగా, ఓ ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. చట్ట వ్యతిరేకంగా గుమికూడడం, అల్లర్లకు పాల్పడడం అభియోగాలపై పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. లాల్బాగ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మత ప్రదర్శనలో పాల్గొని తిరిగి వెళుతున్న వారిపై మరో వర్గం వారు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారినట్టు మత ఘర్షణనలకు దారితీసింది. దీంతో లాల్బాగ్, భారత్ మాత, బైకలా, పరేల్ తదితర ప్రాంతాల్లో పరిస్ధితులు ఒక్కసారిగా వేడెక్కాయి. అనేక మంది స్థానికులు రోడ్డుపైకి వచ్చారు. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అసాంఘిక దుష్టశక్తులు రాళ్లు రువ్వి శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లజేశారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పక ముందే పోలీసులు, ఇతర దళాలను రంగంలోకి దింపినట్లు నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం ఈద్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే కొందరు మైనార్టీ యువకులు ఆదివారం రాత్రి బైక్‌లపై ర్యాలీ నిర్వహించారు. దీంతో నగర రహదారులపై ట్రాఫిక్ జాం ఏర్పడింది.భారత్‌మాతా జంక్షన్ వద్ద బైక్‌లపై ముగ్గురేసి యువకులు ప్రయాణిస్తుండగా, వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదంటూ స్థానికులు కొందరు అక్కడున్న పోలీసులను ప్రశ్నించారని భోయివాడ పోలీస్‌స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ తోండ్వాల్కర్ చెప్పారు. ఈ ఘటన బైక్‌పై ఉన్న యువకులకు, పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వివాదానికి దారి తీసిందన్నారు. ఆ తరువాత పరిస్థితి అదుపు తప్పి రెండు గ్రూపుల వారు పరస్పరం చేయి చేయి చేసుకున్నారని చెప్పారు. దీంతో మరిన్ని పోలీసు బలగాలను అక్కడికి రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారని, సెంట్రల్ రైల్వే వర్క్‌షాప్ వద్ద ఒక మోటార్‌సైకిల్ ధ్వంసమైందని కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అదే సమయంలో కొందరు రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు కనిపించింది. కానీ పోలీసులు వెంటనే బలగాలను రంగంలోకి దింపి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించగలిగారు. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి వర్లీలో కొందరు రాస్తారోకో చేపట్టారు. దీంతో అక్కడ కూడా వాతావరణం వేడెక్కడంతో పోలీసులను మోహరించారు. మొత్తానికి సోమవారం రెండున్నర గంటల సమయానికి ప్రశాంతత నెలకొంది. అర్థరాత్రి వరకు రాకేశ్ మారియా లాల్బాగ్ ప్రాంతంలో పర్యటిస్తూనే ఉన్నారు. ఎప్పకప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. సోమవారం కూడా శాంతి, భద్రతలు అదుపులోనే ఉన్నాయని మారియా అన్నారు. ఎలాంటి వదంతులు నమ్మవద్దని నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాంబేకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని చెప్పారు. -
అనుమానంతో భార్యను కడతేర్చాడు
* మావోయిస్టు ప్రాంతంలో సంచలనం *ఆలస్యంగా వెలుగులోకి పాడేరు(జి.మాడుగుల) : అనుమానంతో కట్టుకున్న భార్యను అతికిరాతకంగా కత్తితో పొడిచి భర్త హతమార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జి.మాడుగుల మండలంలోని మావోయిస్టు ప్రభావిత బొయితిలి పంచాయతీ దిగరాపల్లిలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. మారుమూల ప్రాంతం కావడం, మంగళవారం సాయంత్రం మృతురాలి సోదరుడు ఏసేబు జి.మాడుగుల పోలీసుకు ఫిర్యాదు చేసే వరకు ఇది వెలుగులోకి రాలేదు. గ్రామానికి చెందిన బట్టి సత్యారావు(40) భార్యపై అనుమానంతో తరచూ తగాదా పడేవాడు. పలుమార్లు గ్రామ పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినప్పటికి ఫలితం లేకపోయింది. సోమవారం సాయంత్రం భార్య బట్టి ముత్యమ్మ(34)తో ఘర్షణ పడిన సత్యారావు ఇంటిలో ఉన్న కత్తిని తీసుకొని ఆమె ఛాతి భాగంలో పొడిచాడు. అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు పరారయ్యాడు. మృతురాలి సోదరుడు ఏసేబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ శేఖరం కేసు నమోదు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లలేకపోయారు. బుధవారం ఉదయాన్నే పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి వెళతామని ఎస్ఐ తెలిపారు. -
‘పశువుల మాంసంతో నూనె తయారీ’ కేసులో...
ముగ్గురి అరెస్టు.. రిమాండ్ మర్రిగూడ : పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న వారిలో ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు నాంపల్లి సీఐ ఈ.వెంకట్‌రెడ్డి తెలిపారు. మర్రిగూడ మండలంలోని తానేదార్పల్లి గ్రామ గుట్టల్లో పెద్ద పెద్ద పొయ్యిలను ఏర్పాటుచేసి పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న వైనంపై ఈ నెల ఒకటిన ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఆరాతీయగా మాంసంతో నూనె తయారు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో ఆ ముగ్గురిని సీఐ వెంకట్‌రెడ్డి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరిపై కేసు నమోదు చేసి దేవరకొండ కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో మర్రిగూడ ఎస్ఐ కె.మురళీమోహన్ తదితరులు ఉన్నారు. -
అత్యాచార ఘటనలో నిందితులకు రిమాండ్
నిర్భయ చట్టం కింద కేసు నమోదు హైదరాబాద్: హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట శివార్లలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలి పిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన యువతి (22) నగరంలోని హాస్టల్లో ఉంటూ ‘లా’ చదువుతోంది. ఎల్బీనగర్కు చెందిన యువకుడు రెం డేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ సోమవారం మధ్యాహ్నం పెద్దఅంబర్‌పేటలోని శబరిహిల్స్ వెంచర్‌లోని ఓ పాడుబడ్డ గదిలోకి వెళ్లారు. ఇది గమనించిన నల్లబోలు శ్రీనివాస్‌రెడ్డి (32), బండి లింగారెడ్డి (27) తమ సెల్ఫోన్లో వారి ఏకాంత దృశ్యాలను చిత్రీకరించారు. తర్వాత యువకుడిపై దాడి చేసి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ఫోన్లోని దృశ్యాలను యువతికి చూపించి బెదిరించారు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. యువతి ఫోన్ నంబర్ తీసుకొని పిలిచినప్పుడుల్లా వచ్చి తమ కోరిక తీర్చాలని లేకుంటే దృశ్యాలను బయట పెడతామని హెచ్చరిం చారు. మరుసటి రోజు నిందితులు యువతికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని వేధించారు. వారి వేధింపులు తాళలేక యువతి బుధవారం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, లింగారెడ్డిలను పెద్దఅంబర్‌పేట చౌరస్తాలో అరెస్టు చేశారు. గురువారం హయత్‌నగర్ 7వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా మేజి స్ట్రేట్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా మర్రిపెడ గ్రామం. కొన్నాళ్లుగా పెద్దఅంబర్‌పేటలో వెల్డింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. లింగారెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలం పెద్దవీడు. ప్రస్తుతం పెద్ద అంబర్‌పేటలో బైకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా, యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు ఫోన్లలో ఉన్న దృశ్యాలను తొలగించారని ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్కు వారి ఫోన్లను పంపించి ఆ దృశ్యాలు ఇంకా ఎవరికైనా పంపారా అనే విషయాలను తెలుసుకొని చర్యలు తీసుకుంటామన్నారు. శివారులోని నిర్మానుష్య ప్రదేశాలలో గస్తీని మరింతగా పెంచుతామని చెప్పారు. -
నిబంధనల ఉల్లంఘన
సాక్షి, చెన్నై: మీనంబాక్కం విమానాశ్రయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఎం డీఎంకే నేత వైగోపై కేసు నమోదు అయింది. ఆయనతోపాటుగా 400 మందిపై కేసులు పెట్టారు. అయితే, నిబంధనలను ఉల్లంఘిస్తున్నా చోద్యం చూసినందుకుగాను విమానాశ్రయం ఇన్స్పెక్టర్ మహిమై వీరన్పై బదిలీ వేటు పడింది. ఎండీఎంకే నేత వైగో చాలా కాలం తర్వాత విదేశాలకు గత వారం వెళ్లారు. ఆయనపై ఉన్న కేసుల ఎత్తివేతతో తొలి పర్యటనలో మలేషియాకు వెళ్లారు. అక్కడ తమిళ మహాసభల్ని ముగించుకుని బుధవారం చెన్నైకు తిరుగు పయనమయ్యారు. విదేశాలకు వెళ్లి వస్తున్న తమ నేతకు ఘన స్వాగతం పలికేందుకు ఎండీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే విమానాశ్రయం పరిసరాల్లో హంగామా సృష్టించాయి. వివాదం: విదేశీ టెర్మినల్ వద్ద ప్రత్యేక ఆంక్షలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరైనా వస్తే, వారిని ఆహ్వానించేందుకు పెద్ద సంఖ్య లో టెర్మినల్ వైపుగా ఎవ్వరూ చొచ్చుకు రాకూడదు. అలాగే, ఊరేగింపులు నిర్వహించరాదు. అయితే, ఎండీఎంకే వర్గాలు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాయి. వైగో బయటకు రాగానే టెర్మినల్ ప్రవేశ మార్గంలోకి చొచ్చుకెళ్లాయి. భద్రతా సిబ్బంది అడ్డుకునే క్రమంలో వైగో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అక్కడి భద్రతా సిబ్బందిని ఆయన తీవ్రంగానే మందలించారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన ఎండీఎంకే వర్గాలు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ టెర్మినల్ నుంచి ఊరేగింపుగా నినాదాలతో హోరెత్తిస్తూ ముందుకు కదిలారు. కేసుల నమోదు: విమానాశ్రయం పరిసరాల్లో సాగిన ఎండీఎంకే వర్గాల హంగామాను అక్కడి ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. నిబంధనల ఉల్లంఘన, భద్రతలో స్థానిక పోలీసుల వైఫల్యంను ఎత్తి చూపుతూ హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నగర పోలీసు యంత్రాంగం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగర పోలీసు కమిషనర్ జార్జ్ ఆదేశాలతో అక్కడి పోలీసులు ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. వైగోకు ఆహ్వానం పలికేందుకు వచ్చిన వారి పేర్లను సేకరించి, కేసుల నమోదుకు నిర్ణయించారు. ఎండీఎంకే నేత వైగో, మల్లై సత్య, పాలవాక్కం సోము తదితరులతో పాటుగా 400 మందిపై కేసులు నమోదు చేశారు. విమానాశ్రయంలో భద్రత విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, వారించిన వారిపై తిరగబడడం, నిబంధనల ఉల్లంఘన, అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తదితర సెక్షన్లతో వీరిపై కేసులు పెట్టారు. చివరకు అక్కడి భద్రతా విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ మహిమై వీరన్పై బదిలీ వేటు తప్పలేదు. ఆయన్ను అక్కడి నుంచి ట్రిప్లికేషన్ క్రైం బ్రాంచ్‌కు మార్చారు. మైలాపూర్ ఇన్స్పెక్టర్ వెంకటరమణను విమానాశ్రయూనికి బదిలీ చేశారు. -
జుట్టు కత్తిరించి.. బట్టలూడదీసి
- మహిళలపై అకృత్యం - పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించని వైనం హత్నూర : సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇద్దరు మహిళలను చిత్రహింసలకు గురిచేసి హింసించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు గ్రామానికి చెందిన బాధితులు చాకలి అనసూజ, చాకలి లక్ష్మి (నిందితుల్లో ఒకడైన అశోక్ మేనత్త అనసూజ, పెద్దమ్మ లక్ష్మి) మాటల్లోనే.. ‘ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన బడెంపేట నరసింహులు(40) హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో అదే గ్రామానికి చెందిన చాకలి అడవయ్య, చాకలి అశోక్ కేసులో నిందితులుగా తెలపడంతో అప్పట్లో పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే వారు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చినా గ్రామానికి రాలేదు. అవిడయ్య, అశోక్ ఆచూకీ తెలపాలని హతుడి బంధువులు బెదిరింపులకు దిగారు. అందులో భాగంగానే ఈ నెల 12వ తేదీన మా ఇళ్లకు వచ్చి మమ్ములను కొట్టి ఈడ్చుకుంటూ గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అక్కడే మా చీరలు ఊడదీసి వాటితోనే అక్కడి స్తంభానికి కట్టేశారు. అవిడయ్య, అశోక్ ఆచూకీ తెలపాలని రాత్రంతా కొట్టారు. దాహం వేస్తోందంటే కొందరి మూత్రం డబ్బాలో పోసి వాటిని నీరంటూ బలవంతంగా తాపించారు. అంతటితో ఆగక మా జుట్టును కత్తిరించి ఆలయం వెనుక వాటికి నిప్పు పెట్టించారు. ఆ రోజంతా నిందితుల ఆచూకీ తెలపాలంటూ కొడుతూనే ఉన్నారు. అదే రోజు రాత్రి నా భర్త(లక్ష్మి) చాకలి యాదయ్య విషయాన్ని హత్నూర పోలీసులకు సమాచారం అందించారు. అయినా వారిని నుంచి ఎటువంటి స్పందనా లేదు. మరుసటి రోజు ఉదయం(ఆగస్టు 13) మా ఇళ్లకు చేరుకుని ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కుతుంటే సదరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ రోజు మధ్నాహ్నం గ్రామంలో ఎవరి కంటా కనపడకుండా సంగారెడ్డికి చేరుకుని ఎస్పీకి ఫిర్యాదు చేశాం. ఇందుకు స్పందించి ఎస్పీ బాధితులపై చర్యలు తీసుకోవాలని హత్నూర పోలీసులను అప్పట్లో ఆదేశించినా ఫలితం లేకుండాపోయింది. ఈ నెల 13 నుంచి సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ నెల 19న జరిగే సమగ్ర సర్వేకు హాజరయ్యేందుకు కొన్యాలకు వెళ్లాలని నిర్ణయించుకుని హత్నూర పోలీసులను సంప్రదించాం. వారు వెళ్లమని సలహా ఇచ్చారు. 18న రాత్రి హత్నూరలోని బంధువుల ఇంటిలో ఉండి 19వ తేదీ ఉదయం కొన్యాలకు వెళ్లాం. మమ్ములను చూసిన గ్రామానికి చెందిన మిహ ళలు బూతులు తిట్టారు’ అని విలేకరులతో తన గోడును వెళ్లబోసుకున్నారు. కేసు నమోదు చేశాం కొన్యాల గ్రామానికి చెందిన చాకలి లక్ష్మి, చాకలి అనసూజల చిత్ర హింసలకు గురి చేసిన విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు కొసాగుతోంది. - రాంరెడ్డి, సీఐ -
ఇక కేసుల వివరాలన్నీ ఆన్లైన్లో..
గుంటూరు క్రైమ్: కేసుల నమోదు, సీడీ, చార్జిషీట్, అరెస్ట్ వివరాలతో పాటు నిందితుల ఫొటోలు, వేలిముద్రలు తదితరాలను అధికారులు ఇక నుంచి క్షణాల్లో తెలుసుకోవచ్చు. వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరిచేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ఈ కాప్స్ పేరుతో ప్రతి ఆన్లైన్లో ఒక్కొక్క కానిస్టేబుల్‌కు శిక్షణ ఇచ్చారు. పోలీస్ శాఖలో ఆధునికమైన క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్) విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా తీసుకొని సీసీటీఎన్ఎస్ అమలుకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. టీసీఎస్ కంపెనీ నుంచి ఔట్ సోర్సింగ్ విధానంలో రూరల్ జిల్లాకు 64, అర్బన్ జిల్లాకు 20 మందిని కేటాయించారు. వీరికి మూడు రోజుల శిక్షణ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సీసీటీఎన్ఎస్ విభాగంలో ప్రారంభించారు. శిక్షణ అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు ఒక్కొక్కరిని కేటాయిస్తారు. వీరు పోలీస్ స్టేషన్లో ఈకాప్స్‌కు సహకారంగా ఉంటూ పనిచేస్తారు. ఈనెల 26వ తేదీలోగా ఎఫ్ఐఆర్, కేస్‌డైరీ(సీడీ), చార్జిషీట్, అరెస్టులు, రౌడీషీటర్లు, సంఘ విద్రోహశక్తులు, నిందితులు తదితర వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్ అధికారి పర్యవేక్షణలో ఆన్లైన్లో పొందుపరుస్తారు. 26న సీసీటీఎన్ఎస్ సేవలు అధికారికంగా ప్రారంభమౌతాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఆరు నెలలపాటు ఆయా సిబ్బంది స్టేషన్లలో విధులు నిర్వహిస్తారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆన్లైన్లో కేసుల వివరాలు, నిందితుల సమాచారం అధికారులు క్షణాల్లో తెలుసుకొని తదుపరి చర్యలు చేపట్టేందుకు సమయం కలసివస్తుంది. ఇదిలా ఉంటే పోలీస్‌శాఖతో సంబంధం లేని వ్యక్తుల తో ఈ వివరాలను నమోదు చేయిస్తే రహస్య సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా తెలుసుకోండి.. అర్బన్, రూరల్ జిల్లాల సిబ్బందికి విడివిడిగా శిక్షణ ఏర్పాటు చేశారు. అర్బన్ సిబ్బంది శిక్షణను అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ , రూరల్ సిబ్బందికి రూరల్ జిల్లా అదనపు ఎస్పీ డి. కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ సమయంలో అధికారులు తెలియజేసే జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలు ఉంటే వెంటనే అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. సమాచారం నమోదులో ఎలాంటి సందేహాలు వచ్చినా సంబంధిత అధికారులకు తెలియచేసిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలన్నారు. రికార్డుల్లో పొందు పరచిన రహస్య సమాచారం బయటకు వెళ్లితే అందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.


