రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఆస్పత్రి నుంచి తిరిగి రావాలని కోరుతూ అన్నాడీఎంకే శ్రేణులు పూజలు చేపట్టారు.
వేలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఆస్పత్రి నుంచి తిరిగి రావాలని కోరుతూ అన్నాడీఎంకే శ్రేణులు పూజలు చేపట్టారు. ఈ పార్టీ టెక్నాలజీ విభాగం జిల్లా కార్యదర్శి జననీ బిగ్ బజార్ అధినేత సతీష్‌కుమార్ అధ్యక్షతన తొర్రపాడిలోని శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం మహా దీపారాధన పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన చేశారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ డెరైక్టర్ రాజ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
అదే విధంగా జిల్లాలోని అన్నాడీఎంకే యూనియన్ ఆధ్వర్యంలో గుడియాత్తం సమీపంలోని మీనూర్ శ్రీ వెంకటేశ పెరుమాల్ ఆలయంలో జయలలిత పే రుపై ప్రత్యేక పూజలు, యాగ పూజలు నిర్వహించారు. అమ్మ ఆరోగ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారని వారి కోరిక వృథా పోదని జిల్లా కార్యదర్శి పార్తిబన్, ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మూలవర్ వెంకటేశ పెరుమాల్‌కు వెండి కవచం, పద్మావతి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేపట్టి యాగ పూజలు చేశారు. కార్యక్రమంలో కేవీ కుప్పం ఎమ్మెల్యే లోకనాథన్, మాజీ జిల్లా కార్యదర్శి రాము, మాజీ యూనియన్ కార్యదర్శి కోదండన్, కార్యకర్తలు పాల్గొన్నారు.