గాయనిగా ఏఆర్ రెహ్మాన్ సోదరి... | A R Rahmans sister to compose music for Malayalam film | Sakshi
Sakshi News home page

గాయనిగా ఏఆర్ రెహ్మాన్ సోదరి...

Mar 3 2015 1:55 AM | Updated on Sep 2 2017 10:11 PM

గాయనిగా ఏఆర్ రెహ్మాన్ సోదరి...

గాయనిగా ఏఆర్ రెహ్మాన్ సోదరి...

సంగీతానికి నిలయం ఏఆర్ రెహ్మాన్ కుటుంబం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ సిని సంగీతానికి అంతర్జాతీయ

 సంగీతానికి నిలయం ఏఆర్ రెహ్మాన్ కుటుంబం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ సిని సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించి పెట్టిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. ఆయన గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఏక కాలంలో రెండు ఆస్కార్ అవార్డులను  గెలుచుకున్న భారతీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. కాగా ఆయన సోదరి రెహానా కూడా సంగీత దర్శకురాలిగా గాయనిగా రాణిస్తున్నారు. అంతేకాదు, చిన్న సోదరి ఇష్రాత్ క్వద్రే కూడా గాయనిగా, సంగీత కంపోజర్‌గా ఎదుగుతున్నారు. ఈమె ఏఆర్ రెహ్మాన్ తొలి చిత్రం రోజా నుంచి పాడటం మొదలెట్టారు. అయితే, కేవలం ఏఆర్ రెహ్మాన్ చిత్రాలకు మాత్రమే పాడుతూ వచ్చారు.
 
 ఆ దిశగా కాదలన్, తిరుడా.. తిరుడా, మే మాదం, పుదియ మొగం, ఇండియన్ తదితర చిత్రాల్లో ఆమె పాడి ఉన్నారు. కాగా, ఇష్రాత్ ఇటీవల శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఐ చిత్రం తెలుగు వర్షన్‌లో నువ్వుంటే... నా జతగా అన్న పాటను ఆలపించారు. అంతేకాకుండా ఇతర భాషల్లోనూ పాడుతూ గాయనీగా తన స్థాయిని పెంచుకుంటున్న ఇస్రాత్ సమీప కాలంలో మహ్మద్ అనే ఇరానీ చిత్రంలో ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో పాడడం విశేషం. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
 అంతేకాకుండా  ఏఆర్.రెహ్మాన్‌తో కలసి వందకు పైగా సంగీత కచ్చేరిల్లో ఇష్రాత్ పాలు పంచుకున్నారు. ఏఆర్ రెహ్మాన్ రూపొందించిన జాతీయ స్థాయి పేరొందిన యూనిటీ ఆఫ్ లైట్... జయ హో లాంటి గీతాల్లోని ఇస్త్రా భాగం పంచుకున్నారు. ప్రస్తుతం ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న రసయాన రోజాకల్ ఎన్నిలే మహా వలియో ఆల్బంలో పాడి  ఆడనున్నారు. ఇది ఎంటీవీలో త్వరలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఏఆర్ రెహ్మాన్ సంగీతానికి గాత్రం కలిపిన ఇస్రాత్ ప్రస్తుతం తమిళంలో పలు యువ సంగీత దర్శకుల దర్శకత్వంలో పాడుతుండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement