బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలోని వివిధ ఆస్పత్రుల శవాల గదుల్లో 811 అనాధ శవాలు పడి ఉన్నట్లు తెలిసింది.
ముంబైలో 811 అనాధ శవాలు
Dec 26 2016 5:53 PM | Updated on Sep 4 2017 11:39 PM
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలోని వివిధ ఆస్పత్రుల శవాల గదుల్లో 811 అనాధ శవాలు పడి ఉన్నట్లు తెలిసింది. వాటికి సంబంధించిన వారెవరూ పోలీసుస్టేషన్లకు రాకపోవడంతో అలాగే మూలుగుతున్నాయి. కాగా, ఉప నగరాలల్లో కూడా అనాధ శవాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో మలాడ్-బోరివలి ప్రాంతాల్లో అనాధ శవాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
జేజే ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రంలో 168, జుహూలోని కూపర్ ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రంలో 198, ఘాట్కోవర్‌లోని రాజావాడి ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రంలో 190, బోరివలిలోని భగవతి ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రంలో 212, గోరేగావ్‌లోని సిద్ధార్ద ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రంలో 43 అనాధ శవాలు పడి ఉన్నట్లు రాష్ట్ర నేర పరిశోధన విభాగం గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా 2015లో మహారాష్ట్ర వ్యాప్తంగా 6,185 అనాధ శవాలను గుర్తించగా.. కేవలం ముంబైలో 1,043 శవాలు ఉన్నాయి.
Advertisement
Advertisement