గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
గ్రానైట్ క్వారీలో ప్రమాదం
Mar 18 2017 12:59 PM | Updated on Oct 8 2018 5:19 PM
- ముగ్గురికి తీవ్ర గాయాలు
కేసముద్రం: గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి శివారులోని ఓ గ్రానైట్ క్వారీలో శనివారం చోటు చేసుకుంది. క్వారీలో రాళ్లు కూలి ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement