బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం పరిసర ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ రెడ్డి 144 సెక్షన్ విధించారు.
బెంగళూరు : బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం పరిసర ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ రెడ్డి 144 సెక్షన్ విధించారు. జయ అక్రమాస్తుల కేసు విచారణకు నగర శివార్లలోని పరప్పన ఆగ్రహార జైలు ఆవరణలో....తాత్కాలిక కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జయలలితను దోషిగా నిర్థారించిన కోర్టు మరికాసేపట్లో తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు అవుతున్నాయి. కాగా నిరసనలు వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు దగ్గర భారీగా బలగాలు మోహరించాయి.