రైతుపై చిరుత దాడి | 1 injured in cheetah attack | Sakshi
Sakshi News home page

రైతుపై చిరుత దాడి

Feb 11 2017 12:35 PM | Updated on Aug 17 2018 2:56 PM

అదిలాబాద్‌ జిల్లా థానూరు మండలం కె.ఉమ్రి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.

థానూరు: అదిలాబాద్‌ జిల్లా థానూరు మండలం కె. ఉమ్రి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులో సంచరిస్తున్న చిరుత వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్న రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా శనివారం ఉదయం గ్రామానికి చెందిన జాదవ్‌ చంద్రకాంత్‌ అనే రైతు పై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో అతనికి స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement