ఆ గ్రామాల్లో భోగి పండగ ఉండదు

bhogi feastivel ban in srikakulam district lingalapadu - Sakshi

 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం

శ్రీకాకుళం, నరసన్నపేట రూరల్‌ : భోగ భాగ్యాలకు నెలవైన భోగి పండగ అన్ని ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు. మండలం లోని కొన్ని గ్రామాల్లో ప్రజలు మాత్రం ఈ పండగకు దూరంగా ఉంటున్నారు. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ లింగా లపాడు, చింతువానిపేట, బసివలస, యారబాడు, వీఎన్‌పు రం గ్రామాల్లో 50 ఏళ్లుగా ఈ పండగ చేసుకోవడంలేదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో యూత్‌ సభ్యులు పలుమార్లు ముందుకు రాగా గ్రామపెద్దలు అడ్డు చెప్పడంతో ఈ పండగను నామమాత్రంగానే చేసుకుంటున్నారు.

ఇదీ కథ..!
లింగాలపాడు, చింతువానిపేట గ్రామాల్లో ఒకసారి భోగి మంట వేశారంట. ఆ మంటలో పిల్లి పడి మరణించిందంట. దీన్ని అపశకునంగా భావించి అప్పట్నుంచి భోగి మంట నిషేధించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఒకట్రెండు సార్లు భోగి మంట వేసేందుకు గ్రామ యువకులు ప్రయత్నించగా కొందరు రోగాల బారిన పడినట్లు తెలిపారు.

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top