
న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగంలో బజరంగ్ 58 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతేడాది బజరంగ్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలవడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గాడు.
గత నెలలో బల్గేరియాలో జరిగిన డాన్ కొలోవ్–నికోలా పెట్రోవ్ టోర్నీలోనూ స్వర్ణం నెగ్గిన బజరంగ్ ఈనెల 23 నుంచి చైనాలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు.