నేటి నుంచి ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ | World boxing championship from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

Aug 25 2017 1:06 AM | Updated on Sep 12 2017 12:56 AM

ప్రతిష్టాత్మక ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది.

హాంబర్గ్‌: ప్రతిష్టాత్మక ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి పది రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారత బాక్సర్లు సిద్ధమయ్యారు.

భారత్‌ తరఫున అమిత్‌ సాంగ్వాన్‌ (49 కేజీలు), కవీందర్‌ బిష్త్‌ (52 కేజీలు), గౌరవ్‌ బిధురీ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు), వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), సుమిత్‌ సాంగ్వాన్‌ (91 కేజీలు), సతీశ్‌ (+ 91 కేజీలు) బరిలోకి దిగనున్నారు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో విజేందర్‌ సింగ్‌ (2009), వికాస్‌ (2011), శివ (2015) మాత్రమే కాంస్యాలను సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement