కీపర్లే కింగ్‌మేకర్లు

Wicketkeepers Have Been In Brilliant Form In IPL 2018 - Sakshi

సాక్షి, స్సోర్ట్స్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11లో ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్‌ క్వాలిఫై కాగా మిగతా మూడు స్థానాల కోసం మిగిలిన జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అన్ని జట్లలోని కీపర్లు బ్యాట్‌ ఝుళిపించడం విశేషం. ఒక్క సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా మినహా మిగతా కీపర్లు తమ తమ జట్టు విజయాల్లో కింగ్‌మేకర్లుగా ప్రధాన భూమికను నిర్వర్తిస్తున్నారు.  ఇక ఈ జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌, కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌,  ముంబై ఇండియన్స్‌ యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషాన్‌లు పరుగుల వరద పారిస్తున్నారు.

ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు వారు సాధించిన పరుగులు

  • రిషభ్‌ పంత్‌ 578 పరుగులు
  • లోకేశ్‌ రాహుల్‌ 537 పరుగులు
  • జోస్‌ బట్లర్‌ 415 పరుగులు
  • మహేంద్ర సింగ్‌ ధోని 393 పరుగులు
  • దినేశ్‌ కార్తీక్‌ 371 పరుగులు
  • ఇషాన్‌ కిషాన్‌ 238 పరుగులు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top